నీటితో నిండిన మట్టి కుండను ఇంట్లో సరైన దిశలో ఉంచితే సంపద, శాంతి పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా వైశాఖ మాసం వంటి శుభకాలంలో చేసే చిన్నచిన్న మార్పులు మంచి ఫలితాలు ఇస్తాయని నమ్మకం ఉంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, ఆర్థిక స్థిరత్వం రావడానికి నీటి ఏర్పాటు చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఏ దిశలో ఉంచాలి?
వాస్తు నిపుణులు చెబుతున్నా ప్రకారం ఈశాన్య దిశ (North-East) నీటి కోసం అత్యుత్తమ స్థానం అంటారు. ఈ దిశను దేవతల ప్రదేశంగా చూస్తారు. ఇక్కడ నీటితో నిండిన మట్టి కుండను ఉంచడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మెరుగవుతుంది. వాస్తు ప్రకారం ఈశాన్య దిశ గురు గ్రహానికి సంబంధించినది. అందువల్ల ఇక్కడ నీటి మూలకం ఉండటం వల్ల జ్ఞానం, అదృష్టం, సంపద పెరుగుతాయని నమ్మకం ఉంది.
Also read: Vastu tips: ఉదయం నిద్రలేచిన వెంటనే చేయకూడని పనులు ఇవే
ఈ జాగ్రత్తలు తప్పవు
కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. కుండ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. నీరు నిల్వగా ఉన్నప్పటికీ దుర్వాసన రావడం, దుమ్ము పేరుకోవడం మంచిది కాదు. ప్రతిరోజూ లేదా తరచుగా నీటిని మార్చడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. చాలా మంది మట్టి కుండను కేవలం నీరు తాగడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వాస్తు ప్రకారం ఇది ఇంటి శక్తిని సమతుల్యం చేసే సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఈశాన్య దిశలో కుండను ఉంచేటప్పుడు భారీ వస్తువులు దగ్గరలో పెట్టకూడదు. ఆ ప్రదేశం ఎప్పుడూ లైట్‌గా, క్లీనుగా ఉండాలి. అక్కడ చిన్న తులసి మొక్క లేదా పచ్చ మొక్కలను ఉంచితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. నీరు, పచ్చదనం కలిసినప్పుడు ఇంట్లో శుభవాతావరణం ఏర్పడుతుంది.
Also read: Motichoor Laddu: మోతీచూర్ లడ్డూ నోరూరేలా ఇలా ఇంట్లో సులువుగా చేసేయండి, రెసిపీ ఇదిగో
దక్షిణ (South) లేదా నైరుతి (South-West) దిశల్లో నీటి కుండ ఉంచడం మంచిది కాదని వాస్తు హెచ్చరిస్తుంది. ఈ దిశల్లో నీరు ఉంచితే ఆర్థిక సమస్యలు రావచ్చు, ఖర్చులు పెరగవచ్చు అని నమ్మకం ఉంది. ముఖ్యంగా నైరుతి కోణం భారమైన శక్తికి ప్రతీక. అక్కడ నీటి మూలకం ఉండటం వాస్తు సమతుల్యతను దెబ్బతీస్తుందని భావిస్తారు. ఇంట్లో మట్టి కుండను ఉంచేటప్పుడు మరో చిన్న చిట్కా కూడా ఉంది. కుండపై చిన్న మూత ఉంచడం లేదా అందంగా అలంకరించడం వల్ల అది ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా వేసవికాలంలో మట్టి కుండలోని నీరు చల్లగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా ఒక చిన్న వస్తువు ఇంటికి చల్లదనం మాత్రమే కాదు, వాస్తు ప్రకారం శుభఫలితాలను కూడా తీసుకువస్తుందని నమ్మకం. నీటితో నిండిన మట్టి కుండను ఈశాన్య దిశలో ఉంచడం ఉత్తమం.