BigTV English

Nidhhi Agerwal: అయ్యో.. పాపం నిధిని ఎంతగా ఆడుకున్నారు.. అది ప్రభుత్వ వాహనం కాదా?

Nidhhi Agerwal: అయ్యో.. పాపం నిధిని ఎంతగా ఆడుకున్నారు.. అది ప్రభుత్వ వాహనం కాదా?


Nidhhi Agerwal Government Vehicle : ‘వీరమల్లు’ బ్యూటీ నిధి అగర్వాల్‌ ప్రస్తుతం హట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాన్ని వినియోగించడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. తాజాగా నిధి అగర్వాల్‌ ప్రభుత్వ వాహనంలో వెళుతున్నట్టు కనిపించింది. దీనిపై నెటిజన్స్‌, ప్రతిపక్షాలు, పవన్‌ కళ్యాణ్‌ యాంటీ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున చర్చ, రచ్చ చేస్తున్నారు. ప్రభుత్వం రంగంతో సంబంధం లేదని నిధి అగర్వాల్‌.. ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే వాహనాలను వ్యక్తిగత, వాణిజ్య కార్యక్రమాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు.  ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే కేటాయించిన ఈ వాహనాలను ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన నటికి కేటాయించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. 


నిధికి ఏపీలో చేదు అనుభవం

తాజాగా ఈ వివాదంపై నిధి స్పందించింది. ఇది ప్రభుత్వ వాహనమే కానీ, తనకు లోకర్ ఆర్గనైజర్స్ అరెంజ్ చేశారని స్పష్టం చేసింది. అంతేకాని తాను ప్రత్యేకంగా వెహికిల్ కోసం ఏపీ ప్రభుత్వాన్ని కోరలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నిజం కాదని నిధి తెల్చేసింది. మరోవైపు ఇది ప్రభుత్వ వాహనం కాదని, ప్రైవేటు వెహికిల్‌ అంటూ జనసేన నేతలు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిధి అగర్వాల్‌ ఓ జూవెల్లరి షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ వెళ్లింది. దీంతో ఆమె రవాణా సదుపాయాల కోసం సదరు సంస్థ ఆమెకు ఈ వాహనాన్ని కెటాయించారట. ఈ వాహానికి జువెల్లరీ షోరూం యజమనులకు సంబంధించినది అని తెలుస్తుంది. తమ బ్రాండ్‌ ప్రకటన కోసం విజయవాడ వచ్చిన ఆమెను స్వాగతం చెబుతూ.. ఎయిర్‌పోర్టకు ఈ వావానాన్ని పంపించారట. ఇది ప్రభుత్వ వాహనం కాదని, ప్రైవేట్‌ వెహికల్‌ అంటూ అసలు విషయం బయటపెట్టారు.

నెటిజన్లు, ప్రతిపక్షాల విమర్శలు

ఇదంత కావాలనే చేస్తున్నారనే వారు అభిప్రాయపడ్డారు. నిధి అగర్వాల్‌ లాంటి హీరోయిన్‌.. డిఫేం చేసేందుకు ఈ దుష్మచారం చేశారని, కావాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధి ప్రయాణించిన ఈ వాహనికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది అసలు ప్రభుత్వ వాహనం కాదని జనసేన వివాదానికి తెరదింపింది. మరి ఇకనైనా ఈ వివాదానికి తెర పెడుతుందో లేదో చూడాలి.   ఏదేమైనా జువెల్లరి షో రూం ఒపెనింగ్కి వెళ్లిన నిధికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం ఫ్యాన్స్ని బాధిస్తోంది. కాగా లాంగ్గ్యాప్తర్వాత నిధి హరి హర వీరమల్లు మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. పవన్కళ్యాణ్ప్రధాన పాత్రలో క్రిష్జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వంలో పీరియాడికల్యాక్షన్ డ్రామా సినిమా రూపొందింది.

Also Read: Jr NTR: ఎన్టీఆర్ కాలర్ కథ ఇదే… ఎత్తిన ప్రతిసారి రిజల్ట్ ఎలా ఉందంటే ?

లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ

ఇందులో నిధి హీరోయిన్గా నటించింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత మిస్టర్మజ్ను, ఇస్మార్ట్శంకర్వంటి చిత్రాల్లో నటించిందిఅయితే వరుస ప్లాప్స్తర్వాత ఇస్మార్ట్శంకర్తో తొలి కమర్షియల్హిట్అందుకున్న ఆమెకు సక్సెస్పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది. మూవీ హిట్తర్వాత కూడా ఆమెకు ఆఫర్స్ రాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్పెట్టింది. అక్కడ కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అవి సక్సెస్సాధించలేదు. అయితే భామ కెరీర్లో హిట్స్కంటే ప్లాప్సే ఎక్కువ. అయినప్పటికీ వెండితెరపై కనిపించిన ప్రతిసారి తన గ్లామర్‌, అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదే క్రేజ్కారణంగా తెలుగులో ఆమెకు మళ్లీ అవకాశాలు వరించాయి. హరి హర వీరమల్లు చిత్రంలో గట్టి కంబ్యాక్ఇచ్చింది. రీఎంట్రీతోనే రెండు పాన్ఇండియా సినిమాలకు కమిటైంది. అందులో వీరమల్లు రిలీజ్అవ్వగా.. ప్రభాస్రాజా సాబ్ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్వర్క్ని జరుపుకుంటోంది. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Sundarakanda trailer: పెళ్లి కోసం రోహిత్ కష్టాలు మామూలుగా లేవుగా.. ఆకట్టుకుంటున్న సుందరకాండ ట్రైలర్!

Gayatri Gupta: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నాకు 5 లక్షలు ఇచ్చాడు.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నటి

The Rajasaab : రీ షూట్లతో మారుతి కన్ఫ్యూజన్… బొమ్మ తేడా కొడుతుందా ఏంటి ?

Gayatri Gupta: ఆ ప్రొడ్యూసర్ నన్ను రే*ప్ చేశాడు… నటి సంచలన వ్యాఖ్యలు

WAR 2 Controversy : బజ్ ఒకే… కానీ, బద్నాం కూడా అయ్యారు

War 2 PreRelease Event: వార్ 2 ప్రీ రిలీజ్ వెంట్ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా? యష్‌ రాజ్ ఫిల్మ్స్ భారీగానే ఖర్చుచేసిందే..

Big Stories

×