Lion Escape Viral Video: అడవులలో వన్యప్రాణాలు ఎంతో హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాయి. ముఖ్యంగా సింహాలు, పులులు చాలా సరదాగా గడుపుతుంటాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ షేర్ చేసే వీడియోలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. వాటి లైఫ్ స్టైల్, ఎంజాయ్ చేసే స్వభావం అందరినీ ఆకట్టుకుంటాయి. ఇటీవల ఓ వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అవుతోంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ జాక్వెస్ బ్రియామ్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ క్లిప్ లో ఓ మగ సింహం తన భార్య, పిల్లలను చూసి పారిపోతూ కనిపిస్తుంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
వైరల్ వీడియోను చూస్తే, ఇందులో ఒక మగ సింహం అడవి మధ్యలో ప్రశాంతంగా కూర్చుని తన పరిసరాలను పరిశీలిస్తుంది. కాసేపట్లోనే ఒక ఆడ సింహం తన పిల్లల గుంపుతో కలిసి అక్కడికి వస్తుంది. దానితో పాటు సుమారు ఐదారు పిల్లలు నడుచుకుంటూ అక్కడికి చేరకుంటాయి. వెంటనే, మగ సింహం వాటిని గుర్తించి మోకాళ్ల మీద నిలబడుతుంది. వాటిని గమనించలేనట్లు నటించడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. తన భార్యతో పాటు పిల్లలతో వేగలేక అలా పారిపోవడంతో అందరూ క్రేజీగా ఫీలవుతున్నారు. అయితే, అక్కడి నుంచి మగ సింహం పారిపోయినప్పటికీ, ఆడసింహం ఏమీ పట్టనట్లు తన పిల్లలతో ముందుకు కదులుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సుమారు 2 లక్షల వ్యూస్ సాధించింది. వేలాది కామెంట్స్ వచ్చాయి.
క్రేజీగా కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా ఫీలవుతున్నారు. “పిల్లలను ఆడించాల్సి వచ్చినప్పుడు ప్రతి మగ వ్యక్తి చేసే పని ఇలాగే ఉంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “బహుశ అతడికి ఏదో ఎమర్జెన్సీ పని గుర్తు వచ్చి ఉంటుంది. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోయాడు” అని ఇంకో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. “మనుషులు, జంతువులు అని తేడా లేదు. మగాళ్లు అందరూ అలాగే ఉంటారు” అని మరికొంత మంది రాసుకొచ్చారు. “ఇది వైల్డ్ లైఫ్ కు సంబంధించి నేను ఈ ఏడాది చూసిన అత్యంత ఆసక్తికరమైన వీడియో ఇదే!” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “మగసింహం ఏం చేస్తుందో ఆడ సింహానికి తెలుసు. కానీ, లైట్ తీసుకుంది” అని రాసుకొచ్చారు. “అలా వెళ్లిపోయినా ఫర్వాలేదు. ఆడ సింహం తన పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. “సింహాల జీవితం కూడా మనుషుల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, మన జీవితాలు, కనిపిస్తాయి. వాటి జీవితాలు కనిపిస్తాయి” అంటూ సర్థి చెప్పుకుంటున్నారు.
Read Also: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?