Gayatri Gupta: గాయత్రి గుప్తా(Gayatri Gupta) కెరియర్ మొదట్లో యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం నటిగా సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. ఈమె ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ పాత్రలో నటించి సందడి చేశారు. ఇకపోతే కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్ వంటి సినిమాలలో కూడా నటించారు. ఇలా పలు సినిమాలలో నటిస్తున్న సమయంలోనే కొన్ని వ్యక్తిగత కారణాలు, ఇండస్ట్రీలో దర్శక నిర్మాతల నుంచి ఎదురైన ఇబ్బందుల కారణంగా అవకాశాలు తనకు క్రమక్రమంగా తగ్గిపోయాయని తెలిపారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు ఉన్న జబ్బు గురించి కూడా సంచలన విషయాలను బయటపెట్టారు.
యాంక్లోసింగ్ స్పాండిలైటిస్…
తాను కెరియర్ మొదట్లో ఓ మీడియా ఛానల్ లో జాబ్ సంపాదించానని అయితే ఓ రోజు స్టెప్స్ ఎక్కుతుండగా స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో స్టెప్స్ కూడా ఎక్కలేక ఇబ్బంది పడిపోయానని తెలిపారు. తనకు యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి వచ్చిందని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా చాలా ఇబ్బందులు పడ్డానని పూర్తిగా బెడ్ కి పరిమితం కూడా అయ్యానని తెలిపారు. అయితే ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే సుమారు 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. అంత డబ్బు నా దగ్గర లేదు. ఇక తన స్నేహితులందరు కలిసి ఫండ్స్ కలెక్ట్ చేస్తే కేవలం రెండు లక్షలు మాత్రమే వచ్చింది.
సందీప్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్…
ఇలా తన ట్రీట్మెంట్ కోసం సగం డబ్బులు అయిన దొరికితే బాగుండు అనుకునే సమయంలో నా ఆలోచనలోకి వచ్చిన మొదటి వ్యక్తి డైరెక్టర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy) అని తెలిపారు. సందీప్ రెడ్డి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఫిదా సమయంలో నాకు పరిచయమయ్యారని అలా తనతో ఉన్న పరిచయం కారణంగా నా ఆరోగ్య పరిస్థితి గురించి వివరించాను. ఇలా తాను ఒక మెసేజ్ చేయగానే సందీప్ రెడ్డి ఏకంగా రూ. 5 లక్షలు నాకు సహాయం చేశారు అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఒక్క మెసేజ్ తో నాకు ఆర్థిక సహాయం చేసి నన్ను ఆదుకున్నారంటూ సందీప్ రెడ్డి చేసిన సహాయం గురించి చెప్పడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్పిరిట్ పనులలో బిజీగా సందీప్ రెడ్డి…
ఇక సందీప్ రెడ్డి దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడుగా పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్(Prabhas) హీరోగా స్పిరిట్(Spirit) అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో సందీప్ రెడ్డి ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఇందులో ప్రభాస్ కి జోడిగా త్రిప్తి దిమ్రి నటించబోతున్నారు.
Also Read: Gayatri Gupta: ఆ ప్రొడ్యూసర్ నన్ను రే*ప్ చేశాడు… నటి సంచలన వ్యాఖ్యలు