Donald Trump: డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆర్థిక ఆంక్షల కారణంగా భారతదేశంలో అమెరికన్ వస్తువులపై బహిష్కరణకు పిలుపులు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా మెక్‌డొనాల్డ్స్, కోకాకోలా, అమెజాన్, యాపిల్ వంటి అమెరికన్ బ్రాండ్‌లను బహిష్కరించాలని మన దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సమర్థించేవారు, వ్యాపార నాయకులు, దేశ యువత ఎక్కువగా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన 50% టారిఫ్‌లకు ప్రతిస్పందనగా ఈ బహిష్కరణకు పిలుపులు పెరుగుతున్నాయి. భారత ఉత్పత్తులపై భారీ ఆర్థిక భారం విధిస్తోంది. ఈ టారిఫ్‌లు భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీని ఫలితంగా క్రమంగా భారతీయులలో అమెరికా వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో భారతదేశ వ్యాప్తంగా డొనాల్ట్ ట్రంప్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.
భారత వస్తువులను మాత్రమే కొనండి..
భారతదేశం అమెరికన్ బ్రాండ్‌లకు ఓ ప్రధానమైన మార్కెట్‌గా ఉంది. ఎందుకంటే విదేశీ లేబుల్స్ పై భారతీయ వినియోగదారులు మొగ్గుచూపుతారు. ఎగ్జాంపుల్ కు.. కొత్త యాపిల్ స్టోర్ ఓపెనింగ్ లేదా స్టార్‌బక్స్ డిస్కౌంట్ ఆఫర్ల సమయంలో ప్రజలు బారులు తీరుతారు. అయితే, ట్రంప్ టారిఫ్‌లు ఈ ఆకర్షణను ఛేంజ్ చేశాయి. వినియోగదారులు ‘భారత వస్తువులను మాత్రమే కొనండి’ అనే నినాదాన్ని స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ ఉద్యమం దక్షిణ కొరియా దేశానికి చెందిన గ్లోబల్ బ్రాండ్ విజయాన్ని అనుసరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వృద్ధి సాధించారు. దీన్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు.
సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ యూఎస్ఏ’ ట్రెండింగ్
సోషల్ మీడియాలోల ఈ బహిష్కరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ట్విట్టర్ లో ‘బాయ్‌కాట్ యూఎస్ఏ’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ ఉద్యమాన్ని మరింత ఊతం చేకూరస్తున్నారు. భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ బహిష్కరణ భారతదేశ ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంతో పాటు అమెరికన్ కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి తెచ్చే లక్ష్యాన్ని కలిగి ఉంది.
కాకపోతే.. అమెరికన్ బ్రాండ్‌లు మనదేశంలో..?
అయితే, ఈ బహిష్కరణ సవాళ్లు లేకుండా లేదు. అమెరికన్ బ్రాండ్‌లు భారతదేశంలో ఉద్యోగాలను సృష్టిస్తాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలో భాగమై ఉన్నాయి. ఉదాహరణకు, కోకాకోలా, పెప్సీ వంటి కంపెనీలు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ బహిష్కరణ వల్ల స్థానిక ఉద్యోగులపై కొంత ప్రభావం పడవచ్చు. అదే సమయంలో.. ఈ ఉద్యమం భారతీయ వినియోగదారులలో దేశభక్తిని, స్థానిక ఉత్పత్తుల పట్ల అభిమానాన్ని పెంచుతోంది.
ALSO READ: Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్
ALSO READ: ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో