Marriage: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. శోభనం రాత్రే నవవధువు రహస్యం బయటపడింది. తన భర్తకు తెలియకుండా సంచలన రహస్యాన్ని దాచి పెట్టింది. అది శోభనం రాత్రి బయటపడింది. చివరకు ఆ నవవధువు బాల్కనీ నుండి దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే బాల్కనీ నుంచి కిందకు దూకుతున్న క్రమంలో ఆమె రెండు కాళ్లూ విరిగాయి. చివరకు ఆమెను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనుక భారీ మోసం ఉందని పోలీసులు గుర్తించారు. ఇది చాలా రాష్ట్రాల్లో వివాహం పేరుతో పురుషులను మోసం చేసే ఒక గ్యాంగ్‌కు సంబంధించిన ముఠాగా వారు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.
జోధ్‌పూర్ జిల్లాలోని బనద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన చోటుచేసుకుంది. బనద్ తాలుకాకు చెందిన భరత్ అనే వ్యక్తికి చాలా రోజుల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు పెళ్లి కూతరు కోసం చాలా కాలం నుంచి వెతుకుతున్నారు. అయితే భరత్ తండ్రి తన స్నేహితుడైన నందకిశోర్ సోనిని పెళ్లి సంబంధం చూడాలని అడుగుతాడు. దీంతో నందకిశోర్ బిహార్‌కు చెందిన 23 ఏళ్ల సుమన్ పాండేను పెళ్లి కూతురుగా పరిచయం చేశాడు. వివాహం కోసం నవ వధువుకు రూ. 3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి భరత్ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారు. ఇందులో రూ. 1.7 లక్షలు నగదుగా అప్పజెప్పారు. మిగిలిన రూ. 1.3 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించారు.
భరత్, సుమన్ పాండే వివాహం ఆర్య సమాజ్ ఆలయంలో సాంప్రదాయ రీతిలో జరిపించారు. అయితే.. శోభనం రాత్రి అసలు రహస్యాలు బయటపడ్డాయి. సుమన్ పాండేకు గతంలోనే పెళ్లి జరిగిందని భరత్ గుర్తించాడు. ఆమె ఫేక్ సర్టిఫికేట్లతో అనాథను అని.. ఒంటరిగా నివసిస్తున్నట్టు చూపించిందని భరత్ ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఈ విషయం తెలిసి శోభనం రోజు రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం తీవ్ర స్థాయికి వెళ్లింది. చివరకు భరత్ ను శోభనం రూంలోనే బంధించి చీర సాయంతో కిందకు దిగేందుకు ప్రయత్నించింది.
ALSO READ: Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్
సుమన్ పాండే కిందకు దిగుతున్న క్రమంలో కింద తన ఇద్దరు ఫ్రెండ్స్ తన రక్షణగా ఉన్నారు. సందీప్, రవి అనే ఇద్దరు యువకులు ఆమెకు సాయంగా నిలబడ్డారు. అయితే ఆమె బాల్కనీ నుంచి దిగుతున్న క్రమంలో చీర తెగిపోవడంతో కిందపడిపోయి రెండు కాళ్లు విరిగిపోయాయి. ఆమె అరుపులు విని భరత్ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సందీప్, రవి ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారు. భరత్ పేరెంట్స్ సుమన్ పాండేను ఆస్పత్రిలో చేర్పించారు.
ALSO READ: Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు
చివరకు పోలీస్ విచారణలో సుమన్ పాండే భారీ మోసం బయటపడింది. సందీప్ శర్మ, రవి, రూబీదేవి, నంద కిశోర్, జితేంద్ర సోనిలు అందరూ ఓ గ్యాంగ్. వీరి లక్ష్యం వివాహం కోసం ఆశగా ఎదురుచూసే అబ్బాయిలు.. వీరినే లక్ష్యంగా పెట్టుకుని గట్టిగా డబ్బులు లాగడం.. ఆ తర్వాత జంప్ అవ్వడం వీరి చేసే పని. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.