E-Paper
Advertisement

The Rajasaab : రీ షూట్లతో మారుతి కన్ఫ్యూజన్… బొమ్మ తేడా కొడుతుందా ఏంటి ?

The Rajasaab : రీ షూట్లతో మారుతి కన్ఫ్యూజన్… బొమ్మ తేడా కొడుతుందా ఏంటి ?
Advertisement

The Rajasaab :పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి (Maruthi) కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ది రాజా సాబ్ (The Rajasaab). ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దీంతో చిత్ర బృందం కూడా చాలా కాన్ఫిడెంట్ తో ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ పలు కారణాలవల్ల సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేయడం జరిగింది.

ది బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ సినిమాగా ది రాజాసాబ్..

Advertisement

అటు డైరెక్టర్ మారుతి కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ది బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ సినిమాగా ఇది రాబోతోంది. ఇలాంటి కాన్సెప్ట్ మూవీ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పైన రాలేదు అని స్పష్టం చేశారు.ఈ సినిమా కథలో తాతయ్య, నానమ్మ, మనవడి కథను చూపించబోతున్నామని.. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు చాలా కనెక్ట్ అవుతారంటూ మారుతి చాలా నమ్మకంతోనే తెలియజేశారు. కానీ వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలై ఇప్పటికీ ఎంతోకాలం అవుతోంది. ముఖ్యంగా భారీ సెట్స్, వి ఎఫ్ ఎక్స్ ఇందులో చాలానే ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాలేదు.

కన్ఫ్యూజన్లో పడ్డ డైరెక్టర్..

Advertisement

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను రీ షూట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవుట్ పుట్ విషయంలో అటు ప్రభాస్ కి సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల మళ్లీ మళ్లీ తీస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలోని ఒక సన్నివేశం కూడా ఉంచాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ సినిమా అవుట్ పుట్ పై డైరెక్టర్ పూర్తి కన్ఫ్యూజన్లో పడినట్లు తెలుస్తోంది. మరి ఇంత కన్ఫ్యూజ్ నడుమ.. బొమ్మ తేడా కొట్టేలా ఉందే అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అలాంటి సీన్స్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ భూతంగా, ప్రభాస సాధారణ నరుడు గా కనిపించే విధంగా వీరిద్దరి మధ్య ఒక పోరాట సన్నివేశం ఉంటుందని.. దీనికి తోడు సంజయ్ దత్ తన చేతివేళ్ల పిడికిలిలో ప్రభాస్ ని నలిపేసే సన్నివేశం ఉందని సమాచారం. మరి ఇలాంటి సన్నివేశాలు రాజాసాబ్ సినిమాలో పెడితే అభిమానులు అంగీకరిస్తారా లేదా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.

ది రాజాసాబ్ మూవీ పైనే నిర్మాతలు ఆశలు..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ మీద వచ్చిన సినిమాలు ఈ మధ్య సరిగ్గా ఆడకపోయినా.. ఇప్పుడు రాజాసాబ్ సినిమా మీద నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రాజాసాబ్ సినిమా స్టోరీ కొత్త జోనర్ అవ్వడం వల్ల డైరెక్టర్ కొంతమేరకు తడబడుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్ లుగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటిస్తూ ఉన్నారు.

ALSO READ:Parada Movie: ఓపెన్ ఛాలెంజ్ చేసిన డైరెక్టర్.. అనుపమపై అంత నమ్మకమా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×