Gayatri Gupta: గాయత్రి గుప్తా(Gayatri Gupta) యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి నటిగా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నారు. గాయత్రి నటిగా కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్, ఫిదా (Fidaa) వంటి సినిమాలలో నటించారు. ఇలా పలు సినిమాలలో నటించిన ఈమె ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. అయితే సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగానే అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత క్యాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఎంతో మంది దర్శక నిర్మాతలు హీరోయిన్లను అవకాశాల పేరుతో ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక తన విషయంలో కూడా ఇలాంటి సంఘటన ఉన్నాయి అంటూ గాయత్రి గుప్తా తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
నాకు మందు అలవాటు లేదు..
తాను నటించిన సినిమాలలో ఒక సినిమాలో కనుక మీరు గమనిస్తే మధ్యలో నుంచి నేను కనపడను. అలా కనపడకపోవడానికి కారణం దర్శక, నిర్మాతలే అంటూ ఈమె తెలియజేశారు. ఒక సినిమాకు కమిట్ అయిన తర్వాత షూటింగ్ మధ్యలో నుంచి దర్శక నిర్మాతలతో నాకు ఎంతో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. నాకు మందు తాగే అలవాటు లేదు. అయితే ట్రైలర్ హిట్ అయిందని చిత్రబృందం పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడ ఇష్టం లేకపోయినా బలవంతంగా నా చేత మందు తాగించారని ఈమె అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
పథకం ప్రకారమే మందు తాగించారు…
దర్శక నిర్మాతలు పక్కా పథకం ప్రకారమే నా చేత మందు తాగించారని ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ కు ఏదో ముఖ్యమైన పని పడటంతో వెళ్ళిపోయారు. దీంతో ప్రొడ్యూసర్ గారిని తన ఇంట్లో వదిలి మిమ్మల్ని డ్రాప్ చేస్తామని చెప్పి నన్ను వారి కారులో తీసుకెళ్లారు. అప్పటికే మత్తులో ఉన్న నాకు కార్ టైర్ పంచర్ అయింది అంటూ ఫార్మ్ హౌస్ కి తీసుకెళ్లారని తనపై రే* చేయబోయారని గాయత్రి గుప్తా వెల్లడించారు. ఇకపోతే ఆరోజు నన్ను ఆ ప్రొడ్యూసర్ నుంచి తన డ్రెస్ కాపాడిందని, ఆ డ్రెస్ టైట్ గా ఉండటం వల్ల తాను బ్రతికిపోయానని సుమారు గంట పాటు ఇద్దరు మధ్య గొడవ జరిగిందని కూడా తెలిపారు. ఇక నిర్మాత అనుకున్న పని జరగకపోవడంతో డైరెక్టర్ ను పిలిపించి నన్ను తిరిగి కారులో ఇంటిదగ్గర డ్రాప్ చేయమని చెప్పారు.
చెడుగా ప్రచారం చేశారు..
అప్పటికే మరొక ఈవెంట్ మేనేజర్ నన్ను ఫాలో అవుతూ నేను ఇంటిదగ్గర దిగగానే వెనుక నుంచి హగ్ చేసుకుని చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ ఈమె తన జీవితంలో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి తెలిపారు. ఇలాంటి ఇబ్బంది కారణంగానే తాను సినిమా మధ్యలో నుంచి తప్పుకున్నాను. అయితే తాను డైరెక్టర్ ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ అవ్వట్లేదని, నటన పట్ల నాకు నిబద్ధత లేదు అంటూ నా గురించి చాలా చెడుగా ప్రచారాలు చేశారని గాయత్రి గుప్త ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే ఆ ప్రొడ్యూసర్ పేరు, ఆ సినిమా ఏంటనే విషయాలను గాయత్రి ఎక్కడ బయట పెట్టలేదు. ఇక ఈమె సినిమా నుంచి మధ్యలో తప్పుకున్నానని చెప్పడంతో ఈమె తప్పుకున్న ఆ సినిమా ఏంటి అంటూ కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది ఇలాంటి ఇబ్బందుల కారణంగా తమ కెరియర్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
Also Read: Hansika Motwani: విడాకుల రూమర్లపై మౌనం వీడిన హన్సిక… ఎన్నో పాఠాలు నేర్పిందంటూ!