Sreeleela: పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన శ్రీలల (Sreeleela)తెలుగులో సుమారు అరడజనుకు పైగా సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీ లీలకు బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. “ఆషీకీ 3” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు డైరెక్టర్ అట్లీ రణవీర్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా శ్రీ లీల నటించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
సుధా కొంగర డైరెక్షన్ లో శ్రీ లీల…
ఇలా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఈమె పూర్తిస్థాయిలో ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “పరాశక్తి”(Parasakthi). దాదాపు 5 సంవత్సరాల తర్వాత సుధా కొంగర ఈ సినిమాకు కమిట్ అవడంతో ఈ సినిమా బలమైన కథా నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక శివ కార్తికేయన్ ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఎన్నో మంచి అంచనాలు ఉన్నాయి.
అజిత్ కుమార్ కు జోడిగా శ్రీలీల?
ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీలకు పరాశక్తి డెబ్యూ మూవీ కావటం విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలోనే ఈమె మరో కోలీవుడ్ ఛాన్స్ అందుకున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో అజిత్ కుమార్ (Ajith Kumar)ఒకరు. ఇటీవల అజిత్ కుమార్ గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన మరోసారి అధిక్ రవిచంద్రన్ తో కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
వరుస భాషా సినిమాలతో బిజీగా…
ఇక ఈ సినిమాలో ఇప్పటికే శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. ఇక తాజాగా శ్రీ లీల కూడా ఈ సినిమాలో ఛాన్స్ అందుకున్నారని సమాచారం. అయితే శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించబోతున్నారా? లేదంటే కీలక పాత్రలో నటించబోతున్నారా అనే విషయం తెలియదు కానీ ఈమె మాత్రం అజిత్ కుమార్ సినిమాలో అవకాశమందుకున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమిళ, హిందీ భాషలతో పాటు తెలుగులో కూడా ఈమె రవితేజతో మాస్ జాతర (Mass Jathara)అనే సినిమాలో నటించారు అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh) అనే సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస భాష సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి ఆమెతోనే… శ్యామలాదేవి లీక్స్