Weather News: గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో అయిత వర్షాలు దంచికొడుతున్నాయి. సాయంత్రం, రాత్రివేళల్లో ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే ట్రాఫిక్ లో చిక్కుకుని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అప్డేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది.
రెండు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం..
రాబోయే రెండు గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా భాగ్యనగరంలో వర్షాలు భారీగా పడతాయని చెప్పింది. పటాన్ చెరు, ఆర్సీ పురం, నార్సింగి, గోల్కొండ, రాజేంద్రనగర్, బండ్లగూడ, శివరాం పల్లి, చంద్రయాణ్ గుట్ట, కాటేదాన్, బహదూర్ పుర ప్రాంతాల్లో రానున్న గంట, రెండు గంటల్లో కుండపోత వర్షాలు పడతాయని వివరించింది. ఇవాళ సాయంత్రం, రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. రాష్ట వ్యాప్తంగా కూడా వర్షాలు పడతాయని వివరించింది.
ఈ జిల్లాల్లో కుండపోత వర్షం…
ఇక రాష్ట్రంలో రానున్న రెండు గంటల్లో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిద్దిపేట, జనగాం, మంచిర్యాల, భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం నుంచి దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించారు. సంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల్లో భారీ గాలులుతో కూడిన వర్షం పడనుంది. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు.
పిడుగులు పడే ఛాన్స్.. జాగ్రత్త..!!
రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో సాయంత్రం వేళ పొలాలకు వద్ద వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చెట్ల కింద నిలబడొద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండడం. బయటకు రాకండి. అత్యవసరం అయితేనే బయటకు రావాలి.. లేకుండా ఇంట్లోనే ఉంటే సురక్షితమని అధికారులు చెబుతున్నారు.
ALSO READ: ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో