Sundarakanda trailer:ప్రముఖ హీరో నారా రోహిత్ (Nara Rohit).. ‘భైరవం’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న తర్వాత తాజాగా నటిస్తున్న చిత్రం ‘సుందరకాండ’.. ప్రముఖ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వాఘని హీరోయిన్లుగా నటించారు. హీరో పెళ్లి కష్టాలు కాన్సెప్ట్ తో చాలా అద్భుతంగా ఈ ట్రైలర్ను తీర్చిదిద్దారు. హీరో పడుతున్న కష్టాలు ప్రధానంగా తీర్చిదిద్దిన ఈ ట్రైలర్ ఇప్పుడు నవ్వులు పూయిస్తోంది. ముఖ్యంగా హీరో పరిస్థితిని వివరించే ర్యాప్ సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే తాజాగా సుందరకాండ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.
పెళ్లి కోసం రోహిత్ కష్టాలు..
సుందరకాండ ట్రైలర్ విషయానికి వస్తే ..ఇందులో చాలామంది సీనియర్స్ ను మళ్లీ తెరపై చూపించబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఎవరికివారు తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ప్రముఖ సీనియర్ బ్యూటీ శ్రీదేవి విజయ్ కుమార్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మరొకసారి లీడ్ రోల్ పోషిస్తున్న ఈమె తన అందంతో విపరీతంగా ఆకట్టుకుంటుంది. యంగ్ హీరోయిన్ వ్రితి వాఘనితో పోటీపడి మరీ నటించింది అని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో శ్రీదేవితో మొదటి ప్రేమ, వ్రితి వాఘనితో రెండవ ప్రేమ అన్నట్టుగా చూపించారు. తర్వాత ఇద్దరితో బ్రేకప్ జరిగితే అమ్మాయి అయితే చాలు అనే రేంజ్ కి హీరో దిగజారడం.. పెళ్లికూతురు వెతుకులాటలో ఆయన పడ్డ కష్టాలు.. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి 5 లక్షణాలు ఉండాలి అని రోహిత్ పట్టుబడడం.. ఈయన చెప్పే మాటలు విని అటు స్నేహితులు విసిగిపోవడం అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సుందరకాండ ట్రైలర్ లో వీరే హైలెట్..
ఇకపోతే ఈ ట్రైలర్ లో రఘుబాబు, వీకే నరేష్, సత్య , సునయన, రఘు కారుమంచి, వాసుకి, విటివి గణేష్, రూపా లక్ష్మి, విశ్వంత్ దుండుంపూడి , అభినవ గోమటం, అమృతం వాసు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో వీరందరినీ కవర్ చేస్తూ.. వీరు చేసే కామెడీని హైలెట్గా మార్చారు. సునయన మరొకసారి తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. మరి పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది చూడాలి.
ALSO READ:The Rajasaab : రీ షూట్లతో మారుతి కన్ఫ్యూజన్… బొమ్మ తేడా కొడుతుందా ఏంటి ?