BigTV English

WAR 2 Controversy : బజ్ ఒకే… కానీ, బద్నాం కూడా అయ్యారు

WAR 2 Controversy : బజ్ ఒకే… కానీ, బద్నాం కూడా అయ్యారు

WAR 2 Controversy : వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిన్న గ్రాండ్‌గా జరిగింది. ఈవెంట్‌లో హైలైట్ పాయింట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ అని చెప్పొచ్చు. ఈవెంట్ అయిన నుంచి ఎన్టీఆర్ స్పీచ్ గురించే చర్చ. ఆయన స్పీచ్‌తో రెండు జరిగాయి. ఒకటి… అప్పటి వరకు వార్ 2 మూవీకి బజ్ లేదు అని అన్నారు. కానీ, ఆయన స్పీచ్‌తో సినిమాపై హైప్ ఒక్క సారిగా అందతనంత ఎత్తుకు వెళ్లిపోయింది.


ఇక రెండోది… చాలా రోజుల నుంచి నందమూరి కుటుంబం – జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఫ్యామిలీ పంచాయితీ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. నిన్న రాత్రి స్టార్ట్ అయిన ఈ రచ్చ ఇంకా తగ్గడం లేదు.

దీంతో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్‌తో సినిమాకు బజ్ పెరిగింది ఇటూ బద్నాం కూడా అయ్యాడు అని కామెంట్స్ చేస్తున్నారు.


బజ్ పెరగడానికి కారణమైన కామెంట్స్ ఏంటంటే.. సినిమాపై నమ్మకం ఉంటే తారక్ ఆయా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ల్లో సాధారణంగా తన కాలర్ ఎగరేస్తాడు. దీని వల్ల ఆయన అభిమానులకు నూతన ఉత్సహం, సినిమా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం కలుగుతుంది. అందుకే ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో కాలర్ ఎగరేస్తాడు.

అలాంటిది వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ రెండు కాలర్స్ ఎగరేశాడు. దీంతో సినిమా డబుల్ హిట్ అవ్వడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. అలాగే అదే సందర్భంలో హృతిక్ రోషన్ కూడా రెండు కాలర్స్ ఎగరేశాడు. దీంతో అభిమానులకు డబుల్ భరోసా వచ్చింది.

ఇక బద్నాం అవ్వడానికి కారణమైన కామెంట్స్ అంటే… తారక్ మాట్లాడుతూ, అభిమానుల ఆశీస్సులు తనపై ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరు అంటూ కామెంట్ చేశాడు. అలాగే తాత సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరు అని కూడా అన్నాడు. ఈ మాటలు కొంత మందికి కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయని చాలా మంది అన్నారు.

అలాగే తన వెంట, తన వెనక ఉన్నది తన అమ్మ, నాన్న ఇద్దరు మాత్రమే అంటూ చేసిన కామెంట్స్ కూడా దుమారాన్ని లేపాయి. ఆయన గతంలో తన సక్సెస్ కి కారణం తాతా, నాన్న, బాబాయ్ బాలయ్య అని చెప్పుకున్నాడు. అలాగే తన దృష్టిలో ఇప్పటికీ ఎప్పటికీ కింగ్ బాలయ్య బాబాయే అని కూడా అన్నాడు.

కానీ, ఇప్పుడు తారక్ తన బాబాయ్ బాలయ్య పేరు కూడా చెప్పలేకపోయాడు. దీంతో బాలయ్య అభిమానులు తారక్ ను ట్రోల్ చేస్తున్నారు. సక్సెస్ అయ్యే వరకు కుటుంబంతో ఉండి.. ఇప్పుడు వారి పేర్లను కూడా పలకకపోవడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు.

ఇలా తారక్ ఇటు బజ్ క్రియేట్ చేశాడు. అటు బద్నాం కూడా అయ్యాడు.

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×