E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

కన్నడలో మరో సెన్సేషనల్ థ్రిల్లర్.. వైరల్ అవుతున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ కౌంట్‌డౌన్ పోస్టర్!

కన్నడలో మరో సెన్సేషనల్ థ్రిల్లర్.. వైరల్ అవుతున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ కౌంట్‌డౌన్ పోస్టర్!
Advertisement

Dream Theatre: కన్నడ ఇండస్ట్రీలో ఈ మధ్య చిన్న సినిమాలు కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి .అలాంటి సినిమాల్లో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్న సినిమా “666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్”. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కౌంట్‌డౌన్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.

కొత్త కాన్సెప్ట్ తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా

పోస్టర్లో కనిపిస్తున్న భారీ సిరంజ్, దాని చుట్టూ రక్తపు చుక్కలు, భయంగా కనిపించే కళ్ళు , కిందకు పడిపోతున్న మనిషి ఆకారం ఇవన్నీ కలిపి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.ఇక ఈ పోస్టర్ ని  చూసిన ప్రేక్షకులు ఇది మామూలు  సినిమా  కాదని ఏదో కొత్త కాన్సెప్ట్ తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా కావచ్చు అని అంచనా వేస్తున్నారు.ఇక ఈ సినిమాలో డాక్టర్ శివరాజ్ కుమార్, డాలి ధనుంజయ, ప్రియాంక మోహన్ కీలక పాత్రలో కనిపించనున్నారు .

Advertisement

Also read :ప్రశ్నిస్తే ఓకే.. మరి ఆ బూతుల సంగతేంటి? ప్రకాష్ రాజ్ వెనకేసుకురావడంపై నెటిజన్ల ఫైర్!

కలలు, భ్రమలు వాస్తవం మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్

ఇప్పటికే డిఫరెంట్ స్టోరీ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ధనుంజయ మరోసారి ఎక్స్పరిమెంట్ పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది .పోస్టర్లలో కనిపిస్తున్న విజువల్ ఎలిమెంట్స్ చూస్తే వైద్యరంగం, మానసిక స్థితి, మిస్టరీ, క్రైమ్ వంటి ఎలిమెంట్స్ తో సినిమా సాగుతుందన్న ఊహాగానాలు మొదలైపోయాయి.ముఖ్యంగా డ్రీమ్ థియేటర్ అనే టైటిల్ కారణంగా కలలు, భ్రమలు వాస్తవం మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ సినిమాలో మెయిన్ స్టోరీ కావచ్చని అంచనా వేస్తున్నాయి సినీ వర్గాలు.

టీజర్లో ఈ సినిమాకి సంబంధించిన క్లూస్ ఏమైనా?

Advertisement

ఇక జూలై 3 2026 మధ్యాహ్నం ఒంటి గంటకి టీజర్ రిలీజ్ కానుందని  పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది మూవీ టీం. మొత్తానికి టీజర్  రిలీజ్ కు ఒక రోజు మాత్రమే మిగిలి ఉందని స్పెషల్ గా  హైలెట్ చేయడంతో అభిమానుల్లో ఈ సినిమాపై  మరింత క్యూరియాసిటీ పెంచేసింది .ముఖ్యంగా గత కొన్నిఏళ్లుగా  సౌత్ ఇండియన్ సినిమాల్లో వస్తున్న సైకలాజికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ కనిపిస్తుంది. వైశాఖ జై గౌడ నిర్మిస్తున్న ఈ సినిమాని హేమంత్ ఏం రావు తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ అవుతుండగా టీజర్ లో ఈ సినిమాకి సంబంధించిన క్లూస్ ఏమైనా ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.

జూలై మూడున రాబోతున్న టీజర్

పోస్టర్లోని ప్రతి కంటెంట్ వెనుక  ఇంకా ఏదో రహస్యం దాగి ఉందన్న భావన కలిగించడంలో సక్సెస్ అయ్యారు మూవీ మేకర్స్.మరి నిజంగానే ఆడియన్స్ ని ఈ డ్రీమ్ థియేటర్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందా లేదా పోస్టర్తోనే హై క్రియేట్ చేసే  మరో థ్రిల్లర్ గా  మిగిలిపోతుందా జూలై మూడున రాబోయే టీజర్ తోనే తెలిసిపోనుంది.

Also read :అర్జున్ ‘బ్లాస్ట్’ సినిమా ఫార్ములాతోనే విక్టరీ వెంకటేష్ ఆదర్శకుటుంబం?

Related News

యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. వెండితెరపై హీరోయిన్ ఛాన్స్.. అయినా దానికి నో చెప్పిన నాగదుర్గ!

జైలర్ 2 రిలీజ్ డేట్ లాక్.. మేకర్స్ మాస్టర్ ప్లాన్ అదుర్స్!

‘ప్రశ్న’ రావణ్‌కు ప్రకాష్ రాజ్ సపోర్ట్.. ఆ బూతులకు మద్దతు? సోషల్ మీడియాలో ఇదే చర్చ!

అర్జున్ ‘బ్లాస్ట్’ సినిమా ఫార్ములాతోనే విక్టరీ వెంకటేష్ ఆదర్శకుటుంబం?

హిట్టయినా రూపాయి మిగలలేదు! ‘క’ సినిమా వెనుక అసలు నిజాలు.. లాభపడింది ఆ కొందరే!

రాజమౌళి మళ్లీ ఆ ఛాన్స్ కొట్టేశాడు.. ఈ సారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల పక్కన చోటు

విశ్వంభర వచ్చేస్తోంది.. చిరు సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే

Big Stories

×