Mike Hesson On IND vs PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs Pakistan) మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఐసీసీ టోర్నమెంట్లు జరిగితేనే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య గొడవలు నేపథ్యంలో కేవలం ఐసీసీ టోర్నమెంట్ లలో మాత్రమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే, ప్రతిసారి టీమ్ ఇండియానే విజయం సాధిస్తుంది. వేదిక ఏదైనా సరే, మనోళ్లు ఇరగదీస్తున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ చాలా బలంగా ఉండేది… కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ ముందు కొరకరాని కయ్యగా టీమిండియా మారిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ (Mike Hesson IND vs PAK situation) వివరించారు. టీమిండియా ఓడించడంలో పాకిస్తాన్ ఒక్కటే కాదు, ప్రతీ జట్టు విఫలమౌవుతోందని మైక్ హెస్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా, మనోళ్లే గెలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఐదు సంవత్సరాల నుంచి టీమిండియాను ఓడించేందుకు పాకిస్తాన్ చాలా కష్టపడుతోందని వెల్లడించారు. పాకిస్తాన్ ఒకటే కాదు… టీమిండియాను ఓడించేందుకు చాలా జట్లు ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ తరహా లోనే మిగిలిన జట్లు కూడా విఫలమవుతున్నాయని గుర్తు చేశారు. అయితే టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయినంత మాత్రాన… తమ జట్టును తక్కువగా అంచనా వేయడం, విమర్శలు చేయడం మానుకోవాలని చురకలు అంటించారు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఇండియాను ఢీకొట్టే మొనగాడు లేడని వెల్లడించారు.
అలాంటి జట్టును ఎదుర్కొనేటప్పుడు పాకిస్తాన్ విఫలమవుతోందని స్పష్టం చేశారు. అందుకే టీమిండియాను ఓడించే క్రమంలో ప్రతీసారి పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోందని స్పష్టం చేశారు. టీమిండియా మినహా మిగిలిన జట్లపై పాకిస్తాన్ గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి… మొన్న ఆస్ట్రేలియాను కూడా మట్టి కరిపించినట్లు గుర్తు చేశారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా కూడా టీమిండియా మినహా మిగతా జట్లను పాకిస్తాన్ ఓడించగలిగిందని వెల్లడించారు. టీమిండియాను ఓడించడంలో పాకిస్తాన్ విఫలమైంది తప్ప.. మిగతా జట్లపై తమ జట్టు డామినేషన్ స్పష్టంగా ఉందన్నారు. కానీ టీమిండియాను భవిష్యత్తులో ఓడించే శక్తి తమకు వస్తుందని కూడా పేర్కొన్నారు. గతంలో పాకిస్తాన్ విన్నింగ్ పర్సెంట్ 20% ఉంటే.. అది ఇప్పుడు 70% కు పెరిగిందని క్లారిటీ ఇచ్చారు. దీంతో టీమిండియా పై పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.