E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

‘ప్రశ్న’ రావణ్‌కు ప్రకాష్ రాజ్ సపోర్ట్.. ఆ బూతులకు మద్దతు? సోషల్ మీడియాలో ఇదే చర్చ!

‘ప్రశ్న’ రావణ్‌కు ప్రకాష్ రాజ్ సపోర్ట్.. ఆ బూతులకు మద్దతు? సోషల్ మీడియాలో ఇదే చర్చ!
Advertisement

Prakash Raj: ప్రకాష్ రాజ్.. సినిమాలలో ఎంత ఫేమస్ కాంట్రవర్సీలకు అంతే ఫేమస్.ఇక తాజాగా మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ప్రశ్న’ రావణ్ ని  సపోర్ట్ చేస్తూ మరోసారి వార్తల్లో హైలైట్ అయ్యాడు.ప్రశ్న రావణ్ కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే.. గత నెల 28వ తేదీన ఏలూరులో ‘దళిత క్రైస్తవ సమర శంఖారావం సభ’ జరిగింది. ఈ సభలో స్పీచ్ ఇచ్చిన ప్రశ్న రావణ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాధా మనోహర్ దాస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై బూతులతో చెలరేగిపోయాడు .దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం, దానికి ప్రశ్నిస్తూ అరెస్ట్ చేస్తారా అంటూ ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేయడం తెల్సిందే.

ఇపుడు సోషల్ మీడియాలో హాట్ డిబేట్

Advertisement

అయితే అలా బూతులు మాట్లాడిన వ్యక్తికే  యాక్టర్ ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ డిబేట్ గా మారింది .అసలు ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేశాడు అంటే ఆ బూతులను కూడా ఆయన సమర్థిస్తున్నట్టేనా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.నిజానికి ప్రకాష్ రాజ్ కి ఇది కొత్త కాదు గతంలో చాలాసార్లు ఇలాగే ప్రశ్నించే వారిని ఎంకరేజ్ చేశాడు కూడా . కేవలం రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను సామాజిక అంశాలపై ఆయన ఎప్పుడూ ముక్కుసూటిగా స్పందిస్తూనే ఉంటారు.

సోషల్ మీడియాలో రెండు వర్గాలు

బహుశా ఇదే కనెక్టివిటీ తో ప్రశ్న’ రావణ్  ఉన్న ఆ ప్రశ్నించే నిజాన్ని చూసి ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేసి ఉండొచ్చు .కానీ నెటిజన్లు మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా పెట్టడం లేదు.వ్యవస్థను ప్రశ్నించడానికి వంద దారులు ఉన్నాయి అంతేకానీ సభ్య సమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడే విధానాన్ని ఎలా సమర్థిస్తావు అంటూ  ప్రకాష్ రాజు ని  టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు.ఇక ఇదే వివాదంపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా ఏర్పడ్డారు కొందరు.

అతను లేవనెత్తే పాయింట్స్ 100% నిజం

Advertisement

ఒక వర్గం వారు ప్రశ్న రావణ్ వాడే భాష తప్పు కావచ్చు. కానీ అతను లేవనెత్తే పాయింట్స్ 100% నిజం అందుకే ప్రకాష్ రాజ్ అతనికి సపోర్ట్ చేశారని సమర్థిస్తున్నారు. మరో వర్గం మాత్రం సమాజంలో మార్పు తీసుకురావాలనే వ్యక్తికి కనీస సంస్కారం ఉండాలని ,అలాంటి బూతుల కంటెంట్ ని  ప్రమోట్ చేయడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు అంటూ ప్రకాష్ రాజ్ పై విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు మరికొందరు .

గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ 

ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఎక్స్‌ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్స్‌లో  పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.సమాజంలో తప్పులను ఎత్తిచూపడం వేరు, దాని కోసం వాడే భాష వేరు.ఎంత మంచి ఉద్దేశం ఉన్న చెప్పే విధానం బూతులతో ఉంటే అసలు చెప్పాలనుకున్న పాయింట్ పక్కదారి పడుతుందని అంటున్నారు విశ్లేషకులు .ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ లాంటి నేషనల్ అవార్డీ ప్రశ్న’ రావణ్ బూతులకి సపోర్ట్ గా ఉందనే ప్రచారం జరగడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయిపోయింది .

మరి ఈ ఇష్యూ పై ప్రకాష్ రాజ్  క్లారిటీ ఇస్తాడా లేక తన సైలెన్స్ తోనే ఈ ఇష్యూ కి మరింత ఆజ్యం పోస్తాడో  చూడాలి!

Also read :అర్జున్ ‘బ్లాస్ట్’ సినిమా ఫార్ములాతోనే విక్టరీ వెంకటేష్ ఆదర్శకుటుంబం?

Related News

కన్నడలో మరో సెన్సేషనల్ థ్రిల్లర్.. వైరల్ అవుతున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ కౌంట్‌డౌన్ పోస్టర్!

జైలర్ 2 రిలీజ్ డేట్ లాక్.. మేకర్స్ మాస్టర్ ప్లాన్ అదుర్స్!

అర్జున్ ‘బ్లాస్ట్’ సినిమా ఫార్ములాతోనే విక్టరీ వెంకటేష్ ఆదర్శకుటుంబం?

హిట్టయినా రూపాయి మిగలలేదు! ‘క’ సినిమా వెనుక అసలు నిజాలు.. లాభపడింది ఆ కొందరే!

రాజమౌళి మళ్లీ ఆ ఛాన్స్ కొట్టేశాడు.. ఈ సారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల పక్కన చోటు

విశ్వంభర వచ్చేస్తోంది.. చిరు సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే

మూడేళ్ల గ్యాప్ పై అఖిల్ రియాక్షన్.. 48 కుట్లు.. 2 సర్జరీలు అంటూ!

Big Stories

×