Adarsha Kutumbam: మీడియాలో, టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్.వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ‘ఈ మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసులతోపాటు క్లాసిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచిన ‘బ్లాస్ట్’ సినిమాని పోలి ఉందని.
అవును… సుభాష్ కే రాజ్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి గోపికుమార్, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఇదే సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు చేంజెస్ చేసి వెంకీ తో ఆదర్శ కుటుంబం అని రీమేక్ చేస్తున్నారని ప్రచారం ఫిలిం సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తుంది
బ్లాస్ట్ సినిమాకి వస్తే హీరో అర్జున్ ,హీరోయిన్ అభిరామిక్ కాంబినేషన్లో వచ్చే హై హోల్డేజ్ ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లో ఆడియన్స్ కి పూనకాలు తెప్పించాయి .కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఒక సమస్యలో పడ్డ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక మామూలు వ్యక్తి ఇంతటి సాహసానికైనా సిద్ధపడతారు అనే పాయింట్ ని చాలా ఎమోషనల్ గా చూపించారు డైరెక్టర్ .ఇప్పుడు త్రివిక్రమ్ కూడా తన ఆదర్శ కుటుంబంలో దాదాపు ఇదే తరహాలో సెంటిమెంట్ అండ్ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ దట్టించి తెరకెక్కించి ఉండి ఉంటాడని భావిస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.
గతంలో వెంకటేష్ నటించిన ఎన్నో ఫ్యామిలీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాయి.ముఖ్యంగా బంధాల నేపథ్యంలో సాగే సినిమాలకు వెంకీ మామ కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.ఇప్పుడు వస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా లో కూడా ఇంటి పెద్ద బాధ్యతను, కుటుంబ విలువలను ఎలివేట్ చేస్తూనే ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా భారీ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేశారట త్రివిక్రమ్ .
ఇందులో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే పవర్ ఫుల్ ఫైట్స్ అండ్ ఎమోషనల్ సెంటిమెంట్స్ తో ముడిపడి ఉంటుందని సమాచారం.ఇక ఇందులో కూడా త్రివిక్రమ్ మార్క్ ప్రాసలతో కూడిన డైలాగులు, వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా ఈ కథను డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.ఒక సామాన్య కుటుంబంపై శత్రువులు అటాక్ చేస్తే వారిని ఎదుర్కోవడానికి హీరో ఎలాంటి వ్యూహాన్ని రచించాడు ,తన ఫ్యామిలీని ఎలా సేఫ్ జోన్ లోకి తీసుకువచ్చాడు అనే మైండ్ గేమ్ తో ఈ సినిమా సాగనున్నట్టు తెలుస్తుంది.ఇక ఈమధ్య ఆదర్శ కుటుంబం ఫస్ట్ లుక్ పోస్టర్ వదలగానే బ్లాస్ట్ తో మరింతగా కంపారిజన్ చేయడం మొదలెట్టారు నెట్టిజన్లు.
ఈ పోస్టర్లో వెంకీ మామతో పాటు కేజీఎఫ్ బ్యూటీ నిధి శెట్టి అలాగే ఇద్దరు పిల్లలు కనిపించిన విధానం అచ్చం బ్లాస్ట్ లాగే ఉందంటూ ఆరాలు తీసే పనులు పడ్డారు సోషల్ మీడియా వారియర్స్.చూడాలి మరి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లోకి అడుగు పెడతామంటూ హడావిడి చేస్తున్న ఆదర్శ కుటుంబం నిజంగానే బ్లాస్ట్ ని పోలి ఉంటుందా లేక సరికొత్త కథతో మాయ చేస్తుందా!
Also read :హిట్టయినా రూపాయి మిగలలేదు! ‘క’ సినిమా వెనుక అసలు నిజాలు.. లాభపడింది ఆ కొందరే!