E-Paper
Advertisement

Actress Raasi: పెళ్లి చేసుకోవడానికే లావయ్యాను.. రాశి షాకింగ్ కామెంట్స్

Actress Raasi: పెళ్లి చేసుకోవడానికే లావయ్యాను.. రాశి షాకింగ్ కామెంట్స్
Advertisement

Actress Raasi: రాశి, ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. ఒకప్పుడు స్టార్ నటిగా మంచి మంచి పాత్రలు పోషించి, హీరోయిన్‌గా సత్తా చాటారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన కూడా ఆమెకు అవకాశం వచ్చింది. అలాంటి స్టార్ స్టేటస్ అనుభవించిన రాశి (Actress Raasi).. తర్వాత పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ బుల్లితెరపై ‘జానకి కలగనలేదు’ (Janaki Kalaganaledu) అనే సీరియల్‌తో అందరికీ టచ్‌లోకి వచ్చిన రాశి, వెండితెరపై కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆమెకు మంచి మంచి పాత్రలే పడుతున్నాయి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకోవడానికే బాగా లావయ్యాను అంటూ షాకింగ్‌గా చెప్పారు. అలా ఎందుకు అన్నారో, ఆమె మాటల్లోనే..

Also Read- Family Drama Series OTT : రియల్ లైఫ్ కపుల్స్ రీల్ లైఫ్ లో… ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టనున్న మరాఠీ సిరీస్… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి

పెళ్లి చేసుకోవడానికే లావయ్యా!

Advertisement

‘‘దాదాపు 140 సినిమాలు చేశాను. నేను అడ్వాన్స్ తీసుకుని ఆగిపోయిన సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సిన సినిమా. నేను, ఆర్తీ అగర్వాల్ అందులో చేయాలి. విఎన్ ఆదిత్య దర్శకుడు. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు. 6 నెలల తర్వాత అనుకుంటా, స్టోరీ సరిగా కుదరలేదని ఆపేసినట్లుగా తెలిసింది. ఇప్పుడు జీరో సైజ్ అదీ ఇదీ అని అంటున్నారు. కానీ, నేను పెళ్లి చేసుకోవడానికే లావయ్యను. పెళ్లి చేసుకోవడానికి లావై, పెళ్లి తర్వాత ఇంకా బాగా లావయ్యాను. నేను లావుగా ఉంటే ఇక కెరీర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కదా. కెరీర్‌లో పీక్ చూశాను. ఇంకేం చూడాలి. అందుకే, లావుగా ఉంటే ఎవరూ మనల్ని కదిలించరు అని, కావాలని లావయ్యాను. కెరీర్ గురించి ఆలోచించకుండా, లైఫ్ ఏంటనే ఆలోచించాను’’ అని రాశి చెప్పుకొచ్చారు.

Also Read- Rakul Preet Singh: జీబ్రా అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫిదా చేసేస్తోందిగా!

ఆ సీరియల్‌తో రీ ఎంట్రీ..

Advertisement

ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి హీరోయిన్లు పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా.. జీరో సైజ్‌ని ఇష్టపడతాను. కానీ, రాశి అప్పట్లోనే కాస్త బొద్దుగా కనిపించేది. నిజంగానే ఆమె పెళ్లి తర్వాత బాగా లావయ్యారు. మళ్లీ నటనలోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు సడెన్‌గా ఆమె ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అంత లావుగా మారిన రాశి, ఆ సీరియస్‌లో చాలా వరకు తగ్గిపోయి కనిపించారు. ఇప్పుడు, వెండితెరపై కూడా అవకాశాలు వస్తుండటంతో.. చాలా వరకు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అమ్మ, అత్త, వదిన పాత్రలు చేస్తున్నారు. అయితే వాటిని కూడా ఎలా పడితే అలా సెలక్ట్ చేసుకోనని, తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తున్నానని రాశి చెప్పుకొచ్చారు.

Also Read- Sambarala Yetigattu: హీరో శ్రీకాంత్ బర్త్‌డే స్పెషల్.. బ్రిటీషు‌గా ఫస్ట్ లుక్ అదిరింది!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×