నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. మహారత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, సెలక్షన్ ప్రాసెస్, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 732 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా అటు తాజాగా చదువు పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు ఇటు ఇప్పటికే అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.
పోస్టుల వివరాలు..
మొత్తం 732 పోస్టులలో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఇంజినీర్, ఆఫీసర్ కేటగిరీలు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య: 732
వివిధ విభాగాల్లో వెకెన్సీ వివరాలు..
వీటిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 72 ఖాళీలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 37, సివిల్ ఇంజనీరింగ్‌లో 17, కెమికల్ ఇంజనీరింగ్‌లో 15 పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా ఫైనాన్స్, హెచ్‌ఆర్, క్వాలిటీ కంట్రోల్, ఫైర్ అండ్ సేఫ్టీ, లా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో కూడా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. సీబీజీ ఆపరేషన్స్, సేల్స్ వంటి కీలక రంగాల్లో సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు ఎక్స్ పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు అవుతారు.
వయస్సు:
వయోపరిమితి విషయానికొస్తే 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
జీతం:
ఎంపికైన వారికి పోస్టు స్థాయిని బట్టి నెలకు రూ. 30,000 నుంచి గరిష్ఠంగా రూ. 2,80,000 వరకు భారీ వేతనం లభించే అవకాశం ఉంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ప్రతిభను పరీక్షించేందుకు బహుళ దశల ఎంపిక ప్రక్రియను రూపొందించారు. ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. రాత పరీక్షను మే 3, 2026న నిర్వహించాలని సంస్థ భావిస్తోంది.
దరఖాస్తు విధానం:
అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు హెచ్‌పీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఫిబ్రవరి 25 మధ్యాహ్నం 1:00 గంట నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 25 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.hindustanpetroleum.com/
నోట్: దరఖాస్తుకు చివరి తేది: మార్చి 25
ALSO READ: High Court Jobs: హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే