E-Paper
Advertisement

Bangladesh On PSL: త‌ల‌లు లేపేస్తామ‌ని తాలిబ‌న్ల హెచ్చ‌రిక‌లు.. PSL 2026 నుంచి బంగ్లా ప్లేయ‌ర్లు ఔట్

Bangladesh On PSL: త‌ల‌లు లేపేస్తామ‌ని తాలిబ‌న్ల హెచ్చ‌రిక‌లు.. PSL 2026 నుంచి బంగ్లా ప్లేయ‌ర్లు ఔట్
Advertisement

Bangladesh On PSL:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీ నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుంది. మార్చి 26వ తేదీన ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ మే మాసం మూడవ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో బంగ్లాదేశ్ ప్లేయర్లు ( Bangladeshi players) ఆడడం సందిగ్ధంగా మారింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ అబెదిన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం తమ బంగ్లా ఆటగాలను పాకిస్తాన్ దేశానికి పంపేది డౌటేనని తెలిపారు నజ్ముల్ అబెదిన్ ( BCB chairman Nazmul Abedin). పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ సర్కార్  ( Bangladesh Government) తుది నిర్ణయం తీసుకున్న తర్వాత తమ ప్లేయర్లను పంపే దానిపైన నిర్ణయం తీసుకుంటామని చివరి క్షణంలో ట్విస్ట్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) ఆందోళనకు గురి అవుతోంది.

Also Read: Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు, పాకిస్తానే వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలుస్తుంది

తాలిబ‌న్ల హెచ్చ‌రిక‌లు.. PSL 2026 నుంచి బంగ్లా ప్లేయ‌ర్లు ఔట్

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ఆసుపత్రి పైన పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో 400 మంది మరణించారు. దీంతో పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు తాలిబ‌న్స్ సిద్ధమవుతున్నారు. రంజాన్ పూర్తయిన తర్వాత ఈ క్షణమైనా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ జరిగే స్టేడియాల పైన బాంబులు వేస్తామని ఇప్పటికే తాలిబ‌న్స్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ అబెదిన్ ( BCB chairman Nazmul Abedin) కీలక ప్రకటన చేశారు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ ప్లేయర్లను పంపడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ప్రస్తుతం పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధం నెలకొందని వివరించారు. ఇలాంటి నేపథ్యంలో తమ బంగ్లాదేశ్ ప్లేయర్లను పాకిస్తాన్ దేశానికి పంపిస్తే ఏ క్షణమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుందని నజ్ముల్ షాకింగ్ ప్రకటన చేశారు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వంతో త్వరలోనే చర్చలు జరుపుతామని వివరించారు. బంగ్లాదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే తమ ప్లేయర్లను పాకిస్తాన్ పంపిస్తామని క్లారిటీ ఇచ్చారు నజ్ముల్ అబెదిన్. దీంతో PSL 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ ప్లేయర్లు పాల్గొనేది కాస్త డౌట్ గానే ఉంది.

Advertisement

 

 

Also Read: Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !

 

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×