E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్

Nindu Noorella Saavasam Serial Today Episode April 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఉదయమే వెళ్లి లాల్‌సింగ్‌ అమర్‌ వాళ్లను నిద్ర లేపుతాడు. అమర్‌ నిద్ర లేచి వచ్చి డోర్‌ తీయగానే.. లాల్‌సింగ్‌ సారీ చెప్తూ మిమ్మల్ని డిస్టర్బ్‌ చేశానా..? అంటాడు. అమర్‌ లేదు అంటాడు. ఇంతకీ ఫంక్షన్‌ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చి అని అడగ్గానే.. అవి జరుగుతున్నాయని.. ఫంక్షన్‌ తో పాటు మన ప్లాన్‌ కూడా అమలు చేయాలి కదా అంటాడు లాల్‌సింగ్‌. దీంతో అమర్‌ ఎస్‌ రణవీర్‌కు ఫోన్‌ చేసి మథర్‌ థెరిస్సా అనాథ ఆశ్రమానికి రమ్మని చెప్పాలి అంటాడు. దీంతో లాల్‌సింగ్‌ అనుమానంగా నువ్వు అక్కడ అంజును జాయిన్‌ చేయలేదు కదరా వాడికి డౌటు వస్తుందేమో అని అడగ్గానే.. అమర్‌ ఆ ప్రాబ్లమ్‌ రాకూడదనే ముందే ఆ హోమ్‌ వాళ్లకు ఫోన్‌ చేసి విషయం చెప్పాను అనగానే.. లాల్‌సింగ్‌ మంచి పని చేశావు.. ఇప్పుడే రణవీర్‌కు ఫోన్ చేయ్ అనగానే..

అమర్‌ రణవీర్‌కు కాల్‌ చేస్తాడు. రణవీర్‌ నిద్ర పోతుంటాడు. మనోహరి పక్కనే కూర్చుని చూస్తుంటుంది.  పోన్‌ రింగ్‌ అవుతుంటే.. చిరాగ్గా చూస్తూ లేచి ఫోన్‌ రింగ్‌ అవుతుంటే ఎత్తవేంటి..? అని రణవీర్‌ అనగానే.. అది నీ ఫోన్‌ అమర్‌ కాల్ చేస్తుంటే నేను ఎలా ఎత్తను..? అంటూ సమాధానం ఇస్తుంది. ఇంతలో కాల్ కట్‌ అవుతుంది. అమరేంద్ర కాల్‌ చేసి కట్‌ చేశాడేంటి..? అంటాడు రణవీర్‌. మరోవైపు లాల్‌ సింగ్‌ కూడా ఏమైందిరా కాల్‌ కట్‌ చేశావేంటి..? అని అడుగుతాడు. అమర్‌ ఆ పక్క కాటేజీలో ఫోన్‌ రింగ్‌ అవుతుంది అని చెప్పగానే..అయితే ఏంటి అంటాడు లాల్‌సింగ్‌. అది రణవీర్‌ ఫోన్‌ రింగ్‌ టోన్‌ అని అమర్‌ చెప్పగానే.. లాల్‌సింగ్‌ అనుమానంగా అంటే రణవీర్‌ అతని వైఫ్‌ ఆ కాటేజీలో దిగారా..? అని అడగ్గానే.. అమర్‌ ఎవరో హనీమూన్‌ జంట దిగారని రిసెప్షనిస్ట్‌ చెప్పాడు. అది రణవీర్‌ వాళ్లో కాదో ఇప్పుడు తెలుస్తుంది అని చెప్తాడు అమర్‌. లోపల మనోహరి రణవీర్‌ నీ ఫోన్‌ సైలెంట్‌లో పెట్టు అని చెప్పగానే..

Advertisement

రణవీర్‌ ఎందుకు అని అడుగుతాడు. దీంతో అమర్‌ వాళ్లు కాల్ చేస్తే కట్‌ చేయ్‌ అని చెప్పగానే.. రణవీర్‌ ఎందుకు అలా అంటున్నావు అని అడగ్గానే.. మనోహరి చెప్పింది చేయ్‌ రణవీర్‌ అంటుంది ఇంతలో అమర్‌ కాల్ చేస్తాడు. అమర్‌ మళ్లీ కాల్‌ చేస్తున్నాడు అని చెప్పగానే.. మరోవైపు లాల్‌సింగ్‌ ఫోన్‌ రింగ్‌ అవుతున్నా కాల్‌ లిప్ట్‌ చేయడం లేదేంటి..? అని అడుగుతాడు. కాల్ కట్‌ చేస్తాడు చూడు అంటూ అమర్‌ చెప్తాడు. రణవీర్‌ మళ్లీ మనోహరి ఎందుకు కాల్ కట్‌ చేయమంటున్నావు.. అని అడగ్గానే.. మనోహరి అనుమానంగా అమరేంద్ర నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు అని చెప్తుంది. మరోవైపు లాల్‌సింగ్  అంత కరెక్ట్‌గా ఎలా చెప్పావు..? అని అడగ్గానే.. మేము ఎక్కడ స్టే చేస్తున్నామని రణవీర్‌ అడిగాడు.. ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌ అని చెప్పాను.  కానీ మేము ఇక్కడ దిగామని తెలియక రణవీర్‌ వాళ్లు ఇక్కడ దిగారు అని చెప్తాడు.

మరోవైపు లోపల రణవీర్ నవ్వుతూ అమర్‌ నాకు ఫోన్‌ చేసి నీ గురించి ఎలా తెలుసుకుంటాడు.. మనం ఇక్కడ ఉన్నట్టు తనకు తెలియదు కదా..? అని అడగ్గానే.. మనోహరి కూల్‌గా అమర్ ఆర్మీ వాడు. పైగా ఈ కాశ్మీర్‌లో పని చేసిన వాడు. ఇక్కడ తనకు నెట్‌వర్క్‌ బాగానే ఉంటుంది అని మనోహరి చెప్తుంది. బయట అమర్‌ ఆ రింగ్‌ టోన్‌ రణవీర్‌ ది వెంటనే ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లింది అంటే అది రణవీర్‌ వైఫ్‌ తెలివి. తన గురించి మనకు తెలియకూడదు అనుకుంటుంది అని అమర్‌ చెప్తుంటే వెనక నుంచి వచ్చిన మిస్సమ్మ విని షాక్‌ అవుతుంది. మరోవైపు లోపల మనోహరి ఇక్కడ నేను ఎంత సీక్రెట్‌గా ఉన్నా అమర్‌ తన నెట్‌వర్క్‌ ఉపయోగించి తెలుసుకుంటాడు. అందుకే తనకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకూడదు. మనం ఎక్కడ ఉన్నామో తనకు తెలియకూడదు అంటూ రణవీర్‌ను అలెర్ట్‌గా ఉంచుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×