E-Paper
Advertisement

సీక్రెట్‌గా వివాహం చేసుకున్న కంగనా రనౌత్?.. ఆ మంగళసూత్రం వెనుక అసలు నిజం ఇదే..

సీక్రెట్‌గా వివాహం చేసుకున్న కంగనా రనౌత్?.. ఆ మంగళసూత్రం వెనుక అసలు నిజం ఇదే..
Advertisement

Kangana Marriage: బాలీవుడ్ స్టార్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కంగనా మెడలో మంగళసూత్రం, చేతులకు పచ్చటి గాజులు, లేత గులాబీ రంగు సల్వార్ సూట్ ధరించి సాంప్రదాయబద్ధంగా కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. “కంగనా రనౌత్ ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా?” అంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

Read also-Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు మరోసారి దరిద్రం.. ఇంట్లో నిజం చెప్పేసిన బాలు.. రోహిణి మాటతో షాక్..

Advertisement

అయితే, ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఏమిటనేది ఇప్పడు తెలుసుకుందాం. కంగనా రనౌత్ రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆమె ఇప్పటికీ అవివాహితురాలనేది వాస్తవం. మరి అంతలా వైరల్ అవుతున్న ఆ వీడియో వెనుక ఉన్న కథేంటంటే, అది కేవలం ఒక సినిమా షూటింగ్ లుక్ మాత్రమే.

కంగనా రనౌత్ తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘క్వీన్’ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘క్వీన్ 2’ (Queen 2) షూటింగ్‌లో ప్రస్తుతం పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి ‘క్వీన్ ఫరెవర్’ అనే వర్కింగ్ టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఆ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర కోసమే కంగనా ఈ మంగళసూత్రం ధరించిన లుక్‌లో కనిపించారు. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ముగించుకుని, ఆమె తన భద్రతా సిబ్బందితో కలిసి కారు వైపు వెళ్తుండగా మీడియా ఫోటోగ్రాఫర్లు ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు.

Advertisement

Read also-Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ను రెచ్చగొట్టిన శ్రీయ.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. పల్లవి ప్లాన్ సక్సెస్..

సినిమా సెట్స్‌లో తీసిన ఈ వీడియో కాస్తా, సోషల్ మీడియాలోకి వచ్చేసరికి “కంగనా రహస్య వివాహం” అంటూ తప్పుడు ప్రచారానికి దారితీసింది. కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో కేవలం సినిమా షూటింగ్‌కు సంబంధించింది మాత్రమేనని, కంగనా రనౌత్ వివాహం చేసుకోలేదని స్పష్టమైంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×