E-Paper
Advertisement

తల్లి మరణించిన కొన్ని రోజులకే రేసింగ్ హెల్మెట్ పట్టిన అజిత్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘తలా’ లుక్!

తల్లి మరణించిన కొన్ని రోజులకే రేసింగ్ హెల్మెట్ పట్టిన అజిత్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘తలా’ లుక్!
Advertisement

Ajith Racing: కోలీవుడ్ ఇండస్ట్రీలో  ‘తలా’గా పిలవబడే అజిత్ కుమార్ వ్యక్తిగత జీవితంలో ఎంతటి క్రమశిక్షణతో ఉంటారో, వృత్తి పట్ల ఆయనకున్నకమిట్ మెంట్  ఎలాంటిదో మరోసారి ప్రూవ్ అయింది.తన తల్లి ఈ మధ్యే చనిపోయినా ఆ బాధని అణుచుకుంటూ మళ్ళీ అజిత్ మళ్లీ రేసింగ్ ట్రాక్‌పై అడుగుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

మే 30వ తేదీ  చెన్నైలో కన్నుమూసిన అజిత్ తల్లి

విషయంలోకి వెళ్తే ..గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో, అనారోగ్యంతో బాధపడుతున్న అజిత్ కుమార్ తల్లి మోహిని మణి (89) మే 30వ తేదీ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. నిద్రలోనే ఆమె ప్రశాంతంగా ప్రాణాలు విడిచినట్లు అజిత్ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. తల్లి మరణంతో విషాదంలో మునిగిపోయిన   అజిత్, ఆ విషాదం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే.. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే అంటే జూన్ 5వ తేదీన చెన్నైలోని రేసింగ్ ట్రాక్‌పై ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యానికి, గురిచేస్తోంది. అజిత్ కుమార్ రేసింగ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ.. బరువెక్కిన గుండెతోనే మళ్లీ పనిలోకి దిగానని, జీవితం సాగిపోవక తప్పదంటూ పెట్టిన ఎమోషనల్ క్యాప్షన్ అభిమానుల మనసులను పిండేస్తోంది.

Advertisement

అజిత్ ని పరామర్శించిన ప్రముఖులు 

ఇక అజిత్ తల్లి చనిపోయిన సమయంలో అజిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భారీ భద్రత నడుమ అజిత్ నివాసానికి చేరుకుని, తన చిరకాల మిత్రుడిని  ఓదార్చిన దృశ్యాలు ఇంటర్నెట్‌ లో తెగ సర్క్యులేట్ అయ్యాయి.సినిమా రంగంలో పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగత బంధాలకు వీరు ఇచ్చే ప్రాధాన్యతను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
also read :సైలెంట్‌గా ‘సెంచరీ’ కొట్టేసిన వైష్ణవ్ తేజ్…ఈసారైనా హిట్ కొడతావా గురూ ?

Advertisement

అలాగే ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌తో పాటు కోలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటీనటులు, దర్శకులు అజిత్ ఇంటికి వెళ్లి తమ సంతాపాన్ని తెలియజేశారు.ఇక దిల్ రాజు ప్రొడక్షన్స్ సహా టాలీవుడ్ ప్రముఖులు సైతం అజిత్ మాతృమూర్తి మృతికి సోషల్ మీడియా ద్వారా తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.ఇన్నేళ్లపాటు తన తల్లిని ఎంతో శ్రద్ధగా చూసుకున్న వైద్య బృందానికి, తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అజిత్ కుటుంబం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

అజిత్ మానసిక ధైర్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్

ఒకవైపు చేతినిండా భారీ సినిమాలు, మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో రేసింగ్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్న అజిత్.. గతంలో ‘మంగాతా’, ‘బిల్లా’, ‘విశ్వాసం’ వంటి ఇండస్ట్రీ హిట్లతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. సినిమాల్లో డూప్ లేకుండా బైక్ స్టంట్లు, కార్ రేసింగ్ సీన్లు చేసే అజిత్, నిజ జీవితంలోనూ ప్రొఫెషనల్ రేసర్‌గా ఎన్నో రికార్డులను సృష్టించారు. ఇప్పుడు అమ్మ లేని లోటును తట్టుకుంటూ, స్పోర్ట్స్ పట్ల తనకున్న ప్యాషన్‌ను కొనసాగిస్తూ ట్రాక్‌పైకి రావడం ఆయన మానసిక ధైర్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్.
also read :పెళ్లయిన నాలుగేళ్లకే షాకింగ్ నిర్ణయం.. 42 ఏళ్ల వయసులో మళ్లీ ఒంటరిగా మారిన స్టార్ హీరోయిన్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×