E-Paper
Advertisement

కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది.. కేంద్ర మంత్రి విమర్శలు

కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది.. కేంద్ర మంత్రి విమర్శలు
Advertisement

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ అడ్డగోలుఏ వ్యాఖ్యలు చేస్తున్నారని, అత్యున్నతస్థాయి సంస్థలపై ఆయన చేసినవి నిరాధార వ్యాఖ్యలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అన్ని షాక్ అబ్జార్బర్‌లను(ఆటంకపరిచే వ్యవస్థలను) తొలగించడం వల్ల భారతదేశం ఆర్థిక సునామీ వైపు వెళ్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం చేసిన అసత్యపు వాదనలన్నారు. దేశ ప్రజల్లో లేని భయాందోళనలను రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థపై షాక్ అబ్జార్బ్

Advertisement

ఒకవేళ భారతదేశపు ఆర్థిక వ్యవస్థ షాక్ అబ్జార్బర్‌లను నిజంగానే తొలగించి ఉంటే, అంతర్జాతీయ మార్కెట్ లో విపరీతంగా పెరిగిన ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో సంఘర్షణ, దిగుమతులు, ఎగుమతులపై సప్లై చైన్ లో అంతరాయాలు, ఆర్థికంగా ప్రపంచం అనేక రకాల సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ, నిరంతర భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకు నిలకడగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం ఏ రకమైన షాక్ అబ్జార్బర్‌లను తొలగించలేదని ఆయన పేర్కొన్నారు. 140 కోట్ల భారత ప్రజల సహకారంతో గత దశాబ్ద కాలంలో మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేశారని వెల్లడించారు. ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు వినియోగదారులకు ఊరటనిచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

Also Read: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. అమీర్ పేట అగ్నిప్రమాదం.. బాధితులకు కవిత భరోసా

Advertisement

మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో చూసినట్లయితే 2011 నుంచి 2013 మధ్య రూపాయి విలువ 36 శాతం పడిపోయిందన్నారు. విదేశీ మారక నిల్వలు జూలై 2011లో సుమారు 294 బిలియన్ డాలర్ల నుంచి ఆగస్టు 2013 నాటికి దాదాపు 256 బిలియన్ డాలర్లకు తగ్గాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దిగుమతుల కవరేజ్ మార్చి 2004 నుంచి సెప్టెంబర్ 2013 నాటికి ప్రమాదస్థాయికి పడిపోయిందన్నారు. 2004-2014 ఆర్థిక సంవత్సరాల మధ్య ద్రవ్యోల్బణం సగటున 8.2 శాతానికి దిగజారిందని విమర్శించారు. 2010-2014 ఆర్థిక సంవత్సరాలలో చాలా కాలం పాటు రెండంకెల స్థాయికి పడిపోయిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వపై కిషన్ రెడ్డి ఆగ్రహం

2009-2014 ఆర్థిక సంవత్సరాల మధ్య వరుసగా ఆరు సంవత్సరాల పాటు ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతం లేదా అంతకంటే ఎక్కువగా కొనసాగిందన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా 2004-2014 ఆర్థిక సంవత్సరంలో 31 శాతం నుంచి కేవలం 16 శాతానికి పడిపోయిందని విమర్శించారు. ఇదే యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో జరిగిన అసలైన షాక్ అబ్జార్బర్ల తొలగింపు అని, రాహుల్ గాంధీ తెలుసుకోవలసిన నిజాలు అని, కాంగ్రెస్ దేశాన్ని బలహీనపరిచిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం ఇకనైనా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా ప్రపంచంలో భారత ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు.

Also Read: బీహెచ్‌ఈఎల్ కార్మికుల పెన్నిధి.. ఎవరీ ‘జి. ఎల్లన్న’? హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఏక్ పేడ్ మా కే నామ్

ప్రధానమంత్రి మోడీ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పిలుపు స్ఫూర్తితో.. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.., పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రకృతిని కాపాడటం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యమని అన్నారు.

మెుక్కలు నాటే కార్యక్రమం

ఇది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, అది తల్లిపై గౌరవాన్ని వ్యక్తపరుస్తూనే ప్రకృతిని కాపాడుకోడంపై సమాజంలో అవగాహన పెంపొందించే ఒక మహత్తర ప్రజా ఉద్యమమని తెలిపారు. ప్రకృతి పరిరక్షణ, వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నివారణ, జీవవైవిధ్య సంరక్షణ(బయోడైవర్సిటీ) కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.

Also Read: వానాకాలం ముంపునకు హైడ్రా శాశ్వత పరిష్కారం.. కమిషనర్ రంగనాథ్ సంచలన నిర్ణయం!

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×