E-Paper
Advertisement

అల్లు అర్జున్, అట్లీ టైటిల్ వచ్చేసింది.. ఇదేంటీ ‘రాకాసా’కు సీక్వెల్?

అల్లు అర్జున్, అట్లీ టైటిల్ వచ్చేసింది.. ఇదేంటీ ‘రాకాసా’కు సీక్వెల్?
Advertisement

Raaka Title: అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెపుడా అని ఎదురు చూస్తున్న దర్శకుడు అట్లీ సినిమా టైటిల్ రానే వచ్చేసింది. ఏడాది కాలంగా షూటింగ్ జరుగుతున్నా.. కనీసం ఈ సినిమా గురించి సమాచరం కూడా రానీయలేదు దర్శకుడు.  తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ను విడుదల చేశారు నిర్మాతలు. కాగా ఈ సినిమా టైటిల్‌ ‘రాకా’ను  రివీల్ చేశారు. దీంతో పాటుగా పోస్టర్‌ను కూడా విడుదల చేయడంతో సంబరాలు చేసుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అట్లీ సాధారణంగా కమర్షియల్ ఎంటర్టైనర్లకు పేరుగాంచినప్పటికీ, ఈసారి అల్లు అర్జున్ కోసం ఒక సరికొత్త సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను కళ్లు చెదిరే ధరకు దక్కించుకోవడం విశేషం.

Read also-మార్క్ శంకర్‌కు రెండో జన్మ అంటూ ఎమోషన్ అయిన అన్నా కొణిదల.. ఎందుకంటే?

Advertisement

ఇటీవలే నిహారిక కొణిదల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా ‘రాకాస’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.. అయితే అందులో కూడా రాక్షసుడు ఉంటాడు.. అతను కూడా దాదాపు దాదాపు అలాంటి గెటప్ లోనే కనిపిస్తాడు. దీనిని చూసిన నెటిజన్లు కారాస కి సీక్వల్ ఏమైనా నా ఈ సినిమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా శంకర్ దర్శకత్వంలో కూడా ఇలాంటి గెటప్ ఒకటి చూశాం.. ఇవన్నీ చూసిన నెటిజన్లు ఏదో కొత్తగా వస్తుంది అనుకుంటే.. పాత గెటప్లను కాపీ చేస్తున్నారని మండిపడుతున్నారు. దీని గురించి నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Read also-‘పెద్ది’ స్పెషల్ సాంగ్ నుంచి చివరి క్షణంలో తప్పుకున్న మృణాల్.. ఆ ఛాన్స్ ఎవరికంటే?

Advertisement

ఏడాది కాలంగా ఎదురు చూసిన ఫ్యాన్స్కు ఈ లుక్ అంతగా మింగు పడటం లేదు. దీనిని చూసిన ఫ్యాన్స్ సైతం నిన్న ఏఐతో చేసిన ఇమేజ్ రిలీజ్ చేస్తే ఈ రోజు ఎక్కడో చూసిన పోస్టర్ను విడుదల చేశారు అంటూ మండి పడుతున్నారు. దీనిపై నిర్మాతలు హీరో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.  ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మరి అట్లీ ఏం చేస్తాడో చూడాలి మరి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×