E-Paper
Advertisement

బీహార్ రోడ్లపై షాకింగ్ దృశ్యాలు.. జాంబీల వలె ప్రవర్తిస్తున్న యువ‌కులు

బీహార్ రోడ్లపై షాకింగ్ దృశ్యాలు.. జాంబీల వలె ప్రవర్తిస్తున్న యువ‌కులు
Advertisement

Zombie Drug in Bihar: నేటి ఆధునిక సమాజంలో డ్రగ్స్ మహమ్మారి యువతను నీడలా వెంటాడుతోంది. సరదాగా మొదలై వ్యసనంగా మారి, చివరకు ప్రాణాలను బలిగొనే ఈ విష సంస్కృతి ఇప్పుడు సరికొత్త రూపాలను సంతరించుకుంటోంది. గతంలో గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాల గురించి వినేవాళ్లం.. కానీ ఇప్పుడు మనుషులను బ్రతికున్న శవాలుగా మార్చే అత్యంత భయంకరమైన డ్రగ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా బీహార్‌లో వెలుగుచూసిన ఒక ఘటన, డ్రగ్స్ ప్రపంచం ఎంతటి వికృత రూపాన్ని దాల్చిందో కళ్లకు కడుతోంది.

బీహార్ లోని ఒక కూడలిలో ఒక యువకుడు గంటల తరబడి కదలకుండా, మెదలకుండా ఒకే స్థితిలో నిలబడిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సాధారణంగా మనుషులు అంత సేపు నిలబడటం అసాధ్యం, కానీ ఆ యువకుడు కనీసం పిలుస్తున్నా పలకకుండా ఒక బొమ్మలా మారిపోయాడు. దీనికి కారణం జైలజైన్ (Xylazine) అనే ప్రమాదకరమైన డ్రగ్ అని వైద్య నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఏమిటీ జాంబీ డ్రగ్?

Advertisement

అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే విధ్వంసం సృష్టిస్తున్న ఈ డ్రగ్‌ను ఇంటర్నెట్ ప్రపంచంలో జాంబీ డ్రగ్ అని పిలుస్తారు. ఈ డ్రగ్ తీసుకున్న వ్యక్తి మెదడు పనితీరు పూర్తిగా మొద్దుబారిపోతుంది. బాధితులు స్పృహలో ఉన్నట్లు అనిపించినా, తమ శరీరంపై వారికి ఎటువంటి నియంత్రణ ఉండదు. మనుషులు వింత వింత భంగిమల్లో గంటల తరబడి నిలబడిపోవడం లేదా కూర్చుండిపోవడం జరుగుతుంది. అందుకే వీరు చూడటానికి సినిమాల్లోని జాంబీల వలె కనిపిస్తారు. జైలజైన్ వాడకం వల్ల చర్మంపై కుళ్లిపోయినట్లుగా గాయాలు ఏర్పడతాయి. సకాలంలో చికిత్స అందకపోతే ఆ అవయవాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

సాధారణంగా పశువులకు మత్తు ఇవ్వడానికి ఉపయోగించే ఈ కెమికల్‌ను ఇప్పుడు డ్ర‌గ్ ముఠాలు ఇతర డ్రగ్స్‌తో కలిపి అమ్ముతున్నాయి. బీహార్‌లో వెలుగుచూసిన ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది చాలా తక్కువ ధరకే లభించడం, ఇతర డ్రగ్స్‌తో సులభంగా కలిసిపోవడం వల్ల యువత దీని బారిన పడే ప్రమాదం ఉంది. యువత ఇలాంటి మాయలో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మత్తులో ఊగుతూ సమాజానికి భారంగా మారకుండా, గంజాయి, జైలజైన్ వంటి విషపూరిత పదార్థాలకు దూరంగా ఉండటం నేటి తరం అత్యవసరమ‌ని సూచిస్తున్నారు.

Advertisement

Read Also: కేంద్ర మాజీ మంత్రి మోహ్‌సినా కిద్వాయ్‌‌ కన్నుమూత

Related News

నీట్ ‘లీక్’ రచ్చ.. సుప్రీంకోర్టుకు చేరిన లీకేజీ వివాదం.. NTA తీరుపై FAIMA ఫైర్!

సీఎం విజయ్ నిర్ణయంపై హైకోర్టు సీరియస్.. జ్యోతిష్యుడికి OSD పదవిపై న్యాయపోరాటం!

బల పరీక్షలో నెగ్గిన టీవీకే ప్రభుత్వం.. ఐదేళ్లుపాటు ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్న సీఎం విజయ్

ములాయం కుటుంబంలో అంతులేని విషాదం.. చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ అకాల మరణం

గ్యాస్ వినియోగదారులకు షాక్.. సబ్సిడీ ఇక అందరికీ రాదు.. కొత్త రూల్స్ ఇవే!

Sonia Gandhi: ఆసుపత్రిలో సోనియాగాంధీ.. ఏం జరిగిందంటూ నేతలు, కార్యకర్తలు ఆరా

మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తుల మృతి, 14 మందికి గాయాలు

తమిళనాడు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.. జోస్యం నిజమైంది.. జ్యోతిష్యుడికి సీఎం విజయ్ భారీ ఆఫర్!

Big Stories

Advertisement
×