E-Paper
Advertisement

భారీ అంచనాల మధ్య రేసులోకి…జూలై 9న ‘శ్రీనివాస మంగాపురం’ ఎంట్రీ!

భారీ అంచనాల మధ్య రేసులోకి…జూలై 9న ‘శ్రీనివాస మంగాపురం’ ఎంట్రీ!
Advertisement

Srinivasa Mangapuram : టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ సమర్పణలో, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రెజెంటేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి వైవిధ్యమైన, బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన అజయ్ భూపతి, ఈసారి రూట్ మార్చి ఒక ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఒక సరికొత్త జంట పరిచయం కానుంది.

జూలై 9న  విడుదల కానున్న సినిమా 

Advertisement

రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయ కృష్ణ ఈ చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండగా, ఆయన సరసన రాశ తడాని  హీరోయిన్‌గా నటిస్తోంది.  జూలై 9న  థియేటర్లలో  వస్తుండటం తో ఈ జోడీ  సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని ఇప్పటి నుండే అంచనాలు పెంచేసుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.ఇక ఇటీవల చిత్ర బృందం వైభవంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో దర్శకుడు అజయ్ భూపతి సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.

also read :స్కూల్ బ్యాగ్ వెనుక ఇంత కథ ఉందా? ఎవరు కనిపెట్టారో తెలిస్తే షాక్ అవుతారు!

Advertisement

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరోను లాంచ్ చేయడంపై ఆయన స్పందిస్తూ, ఇది సాధారణ విషయం కాదని, దీని వెనుక ఎంతో బాధ్యత, వెయిట్ ఉంటాయని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల చరిత్ర గురించి మాట్లాడితే కృష్ణ గారి ప్రస్తావన లేకుండా ఆ చర్చ ఎప్పటికీ ముగియదని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలో దశాబ్దాల పాటు కొనసాగినప్పటికీ ఆయన గురించి ఎవరూ ఎప్పుడూ ఒక్క నెగెటివ్ మాట కూడా మాట్లాడటం తాను చూడలేదని, అంతటి క్లీన్ అండ్ లెజెండరీ ప్రొఫైల్ ఆయనదని ఆకాశానికి ఎత్తేశారు.

ఎమోషనల్ ఇన్సిడెంట్‌ గుర్తు చేసుకున్న అజయ్ భూపతి
ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో జరిగిన ఒక రియల్ అండ్ ఎమోషనల్ ఇన్సిడెంట్‌ను అజయ్ భూపతి గుర్తు చేసుకున్నారు. తిరుపతి సమీపంలోని పులిగొండ పరిసర ప్రాంతాల్లో ‘శ్రీనివాస మంగాపురం’ షూటింగ్ జరుగుతున్నప్పుడు, రోడ్డు పక్కన ఉన్న ఒక సాధారణ ఆటో డ్రైవర్ అక్కడకు వచ్చాడని చెప్పారు. ఈ సినిమాలో నటిస్తోంది మరెవరో కాదు, స్వయంగా సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడేనని తెలవడంతో ఆ డ్రైవర్ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడట. వెంటనే తన చేతిపై దశాబ్దాల క్రితం ఎంతో ఇష్టంగా వేయించుకున్న కృష్ణ గారి పచ్చబొట్టును (టాటూ) చిత్ర యూనిట్‌కు చూపించాడని అజయ్ భూపతి వివరించారు. కృష్ణ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సంపాదించుకున్న హార్డ్‌కోర్ అభిమానం తరాలు దాటి ఎలా సజీవంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు.
ఘట్టమనేని వారసుడికి ఎలా కలిసివస్తుందో 
టెక్నికల్ పరంగా, కథల ఎంపిక పరంగా టాలీవుడ్‌లో కృష్ణ గారు చేసినన్ని ప్రయోగాలు, తీసుకున్నంత రిస్క్ మరే ఇతర హీరో చేయలేదని డైరెక్టర్ ప్రశంసించారు. 1970, 80ల కాలంలోనే సరికొత్త టెక్నాలజీని టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనదేనని, ఆ రిస్క్ తీసుకునే అద్భుతమైన క్వాలిటీస్, సినిమా పట్ల ఉన్న ప్యాషన్ మళ్లీ జయ కృష్ణలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని అజయ్ భూపతి నమ్మకంగా చెప్పారు.
also read :డిజిటల్ రైట్స్ రూ.130 కోట్లు.. ఆడియో రైట్స్ రూ.50 కోట్లు.. విడుదలకు ముందే ‘పెద్ది’ వసూళ్ల జాతర
గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ గారు కృష్ణ గారితో ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించగా, ఇప్పుడు మళ్లీ అదే లైనప్‌లో ఆయన మనవడిని ఇండస్ట్రీకి ప్రెజెంట్ చేయడం ఒక రేర్ కాంబినేషన్‌గా నిలిచిపోనుందనడం లో ఆశ్చర్యం లేదు.శ్రీను, మంగలుగా  జయ కృష్ణ, రాశ కనిపించనున్న ఈ  ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం కచ్చితంగా ఘట్టమనేని అభిమానుల అంచనాలను అందుకోవడమే కాకుండా, టాలీవుడ్‌లో అజయ్ భూపతికి మరో మైలురాయిగా నిలుస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది మూవీ టీమ్.చూడాలి మరి జూలై 9 రిలీజ్ కానున్న ఈ  శ్రీనివాస మంగాపురం ఘట్టమనేని వారసుడికి ఎలా కలిసివస్తుందో !

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×