E-Paper
Advertisement

Allu Arjun: పరువు నష్టం దావా.. 42 నిబంధనల వార్తలపై ఘాటుగా స్పందించిన అల్లు అర్జున్ టీమ్!

Allu Arjun: పరువు నష్టం దావా.. 42 నిబంధనల వార్తలపై ఘాటుగా స్పందించిన అల్లు అర్జున్ టీమ్!
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు సంబంధించి సోషల్ మీడియాలో ‘ప్రోటోకాల్’ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ని కలవడానికి పాటించాల్సిన 42 కఠిన నిబంధనలు అంటూ ఓ వీడియా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో మీడియా ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్స్ కోసం సిద్ధం చేసినట్లుగా చెబుతున్న ఓ ‘ప్రోటోకాల్’ (Allu Arjun Protocol) గురించి మాట్లాడుతున్నారు. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి.. అల్లు అర్జున్ మనలాంటి మనిషి కాదా అని నెటిజన్లు కౌంటర్స్ వేస్తున్నారు. ఇదే విషయంపై వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా అల్లు అర్జున్‌పై ఇలాంటి ఆరోపణలు వ్యాపించడంతో.. వెంటనే ఆయన టీమ్ రియాక్టైంది. ఈ మేరకు వారు ఘాటుగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో..

Also Read- Santosh Soban: పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్ళి దెబ్బలు తిన్న హీరో.. మర్చిపోలేనంటూ!

అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన ఇదే..

Advertisement

‘‘తాజాగా అల్లు అర్జున్‌పై వస్తున్న కొన్ని వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి, అవన్నీ పూర్తిగా అవాస్తవం. ఆయన ఎప్పుడూ అత్యంత హుందాతోనూ, అందరి పట్ల గౌరవప్రదంగానే నడుచుకున్నారు. ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. వీటికి బాధ్యులైన వారిపై మా లీగల్ టీమ్ డెఫమేషన్ దావా వేయడానికి సిద్ధమవుతోంది. నిజానిజాలు తెలుసుకోకుండా దయచేసి ఎటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అందరినీ కోరుతున్నాము’’ అని అల్లు అర్జున్ టీమ్ (Allu Arjun Team) అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మరి ఈ ప్రకటనతో అయినా ఈ వార్తలు ఆగుతాయేమో చూడాలి. మాములుగా అయితే అల్లు అర్జున్ గురించి టాలీవుడ్‌లోని అందరికీ తెలుసు. అందరితో బన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని. రీసెంట్‌గానే ఫ్యాన్స్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఎక్కడా ఇలాంటి నిబంధనలు వినిపించలేదు. కానీ, బాలీవుడ్‌లో బన్నీని టార్గెట్ చేసినట్లుగా, ఇప్పుడో పాడ్‌కాస్ట్ వీడియో వైరల్ అవుతోంది.

Allu Arjun Team Reaction (Image Source: X)

Advertisement

Also Read- Mahesh Babu -Namrata: మహేష్ నమ్రతల వెడ్డింగ్ యానివర్సరీ.. నమ్రత ఎమోషనల్ పోస్ట్..

అసలు విషయం ఏమిటంటే..

రాయల్ ఎన్‌ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఒక పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌పై షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్‌ను కలిసే ముందు తన బృందానికి 42 నిబంధనలతో కూడిన ఒక జాబితాను అందించాలని ఆమె అంటున్నారు. అంతేకాదు, ఆయనకు మేనేజర్ తర్వాత మేనేజర్, మరో మేనేజర్ ఇలా ఉంటారని, వారందరినీ దాటుకుని వెళ్లాలని తెలిపారు. ఇంకా ఆమె చెప్పిన వాటిలో అల్లు అర్జున్ కళ్ళలోకి నేరుగా చూడకూడదు, ఆయనతో కరచాలనం చేయకూడదు వంటి ఆంక్షలు కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇలా దాదాపు 42 నిబంధనలు దాటుకుని అల్లు అర్జున్‌తో ఫొటో షూట్ చేయాల్సి ఉంటుందని ఈ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. అంతే ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తూ రకరకాలుగా వార్తలను క్రియేట్ చేస్తున్నారు. ఈ వార్తలపై వివరణ ఇస్తూ.. అల్లు అర్జున్ టీమ్ పై విధంగా పేర్కొంది.

Also Read- Shalini Pandey: గ్లామర్ డాల్ లా అర్జున్ రెడ్డి బ్యూటీ.. ఏం అందం గురూ!

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×