E-Paper
Advertisement

Santosh Soban: పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్ళి దెబ్బలు తిన్న హీరో.. మర్చిపోలేనంటూ!

Santosh Soban: పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్ళి దెబ్బలు తిన్న హీరో.. మర్చిపోలేనంటూ!
Advertisement

Santosh Soban:సంతోష్ శోభన్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంతోష్ శోభన్(Santosh Soban)  ప్రస్తుతం పలు సినిమాలలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన గోల్కొండ హై స్కూల్ సినిమా ద్వారా బాల నటుడుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇక త్వరలోనే సంతోష్ శోభన్ మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ (Couple friendly)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అత్తారింటికి దారేది..

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంతోష్ శోభన్ విభిన్న రీతిలో ఈ సినిమాలను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అలాగే వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు తాను వీరాభిమానని తెలిపారు. అయితే అత్తారింటికి దారేది (Atharintiki Daaredi)సినిమా విడుదల సమయంలో నాపై పోలీసు లాఠీ చార్జ్ జరిగిందంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

పోలీసు లాఠీ చార్జ్..

Advertisement

అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నేను కూడా థియేటర్ కు వెళ్లాలని అయితే ఆ సమయంలో అభిమానుల అత్యుత్సాహం కారణంగా థియేటర్ అద్దాలు పగలగొట్టారు. దీంతో పోలీసులు పవన్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ చేశారని, ఆ సమయంలో అక్కడ నేను ఉండటం వల్ల నేను పోలీసులతో దెబ్బలు తిన్నానని, పోలీసులతో దెబ్బలు తినడం అదే మొదటి, చివరిసారి కూడా అంటూ అప్పటి విషయాలను సంతోష్ శోభన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు .మేము చాలాసార్లు ఇలా తన్నులు తిన్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అత్యుత్సాహంతో భారీ నష్టాలు..

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా విడుదలకు ముందు నుంచి కూడా థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు అభిమానులు చూపించే ఈ అత్యుత్సాహం కారణంగా పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అనుకొని ప్రమాదాలు కారణంగా ప్రాణాపాయం కూడా చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా స్టార్ హీరో సినిమాలు విడుదలైనప్పుడు సామాన్య అభిమానులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడుతుంటారనే విషయం అందరికీ తెలిసిందే.

Also Read: Mahesh Babu -Namrata: మహేష్ నమ్రతల వెడ్డింగ్ యానివర్సరీ.. నమ్రత ఎమోషనల్ పోస్ట్..

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×