E-Paper
Advertisement

Trending Earbuds Feb 2026 India: రూ.3వేల లోపు టాప్ ట్రెండింగ్ ఇయర్ బడ్స్.. క్వాలిటీలో తగ్గేదే లే!

Trending Earbuds Feb 2026 India: రూ.3వేల లోపు టాప్ ట్రెండింగ్ ఇయర్ బడ్స్.. క్వాలిటీలో తగ్గేదే లే!
Advertisement

Trending Earbuds Feb 2026 India: ప్రస్తుత టెక్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ ఎంత ముఖ్యమో.. దానికి జతగా ఇయర్ బడ్స్ కూడా అంతే అవసరంగా మారిపోయాయి. ఆఫీసు కాల్స్ నుంచి జిమ్ వర్కవుట్స్ వరకు.. ఇయర్ బడ్స్ మన జీవితంలో ముఖ్య భాగమైపోయాయి. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి నెలలో చూసుకుంటే.. భారత మార్కెట్లో టెక్నాలజీ అనూహ్యంగా మారిపోయింది. పాత ఫీచర్ల స్థానంలో సరికొత్త AI ఫీచర్లు వచ్చి చేరాయి. ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న 5 బెస్ట్ ఇయర్ బడ్స్ విశేషాలేంటో చూద్దాం.

boAt Airdopes Supreme

బోట్ నుంచి వచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిలో ఉన్న AI based noise isolation ఫీచర్ ఏదైనా లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా స్పష్టంగా మాట్లాడేందుకు సహాయపడుతుంది. తక్కువ ధరలో ప్రీమియం లుక్, అదిరిపోయే బేస్ కావాలనుకునే వారికి ఈ బోట్ ఇయర్ బడ్స్ బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.

OnePlus Buds Pro 3

Advertisement

వన్‌ప్లస్ తన సౌండ్ క్వాలిటీతో ఎప్పుడూ రాజీ పడదు. ఈ కొత్త మోడల్‌లో Adaptive Audio టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో ట్రాఫిక్‌లో ఉన్నా లేదా లైబ్రరీ వంటి ప్రదేశాల్లో ఉన్నా, పరిసరాలను బట్టి సౌండ్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. దీని బ్యాటరీ లైఫ్ దాదాపు 55 గంటల వరకు ఉండటం విశేషం.

Also Read: తక్కువ ధరలో థియేటర్ అనుభవం కావాలా? ఈ ఏడాది మార్కెట్‌ను షేక్ చేస్తున్న బెస్ట్ టీవీలివే!

Realme Buds Air 6

Advertisement

బడ్జెట్ ధరలోActive noise cancellation కావాలనుకునే వారికి ఈ రియల్‌ ఇయర్ బడ్స్ బెస్ట్ ఆప్షన్. బయటి శబ్దాలను 90 శాతం వరకు తగ్గించి, మనం వినే మ్యూజిక్‌పైనే దృష్టి పెట్టేలా చేస్తుంది. ముఖ్యంగా స్టూడెంట్స్, ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు ఈ మోడల్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Noise Buds Combat Z

గేమింగ్ లవర్స్ కోసం నాయిస్ సంస్థ ఈ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దీనిలో Low latency మోడల్ ఉండటం వల్ల గేమ్ ఆడుతున్నప్పుడు సౌండ్ ఏమాత్రం ఆలస్యం కాకుండా వినిపిస్తుంది. దీని స్టైలిష్ డిజైన్, ఆర్జీబీ లైటింగ్ సెటప్ యువతను ఇట్టే ఆకర్షిస్తోంది.

Samsung Galaxy Buds 3 FE

శాంసంగ్ నుంచి వచ్చిన ఈ బడ్స్ ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. మల్టీ డివైస్ కనెక్టివిటీ ఫీచర్ ద్వారా మీరు ఫోన్, లాప్‌టాప్‌కు ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. క్రిస్టల్ క్లియర్ కాల్ క్వాలిటీ కోసం ఈ బడ్స్‌లో 3 మైక్‌లను అమర్చారు. ఇక మీరు కొత్తగా ఇయర్ బడ్స్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, కేవలం బ్రాండ్ పేరు చూసి కాకుండా మీ అవసరానికి తగ్గట్టుగా ఎంచుకోండి.

Also Read: భారత మార్కెట్లోకి టెక్నో పోవా కర్వ్ 2 5G.. దీని లుక్ చూస్తే టెక్ ప్రియులంతా ఫిదా అవ్వాల్సిందే!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×