
Shalini Pandey (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ షాలిని పాండే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ చిన్నది.

Shalini Pandey (Source: Instragram)
సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా నటించి మొదటి సినిమాతోనే కుర్రకారు క్రష్ గా మారిపోయింది.

Shalini Pandey (Source: Instragram)
ఇక తర్వాత మహానటి సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఈమె.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Shalini Pandey (Source: Instragram)
ఇంకొక వైపు ఇన్స్టాగ్రామ్ ద్వారా గ్లామర్ ఫోటోలను పంచుకునే ఈమె.. అప్పుడప్పుడు చీరకట్టులో కూడా కనిపించి అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Shalini Pandey (Source: Instragram)
అయితే ఇప్పుడు తాజాగా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ గ్లామర్ డాల్ గా కనిపించింది షాలిని పాండే.

Shalini Pandey (Source: Instragram)
ప్రస్తుతం షాలిని పాండే ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.