E-Paper
Advertisement

Anupama Parameshwaran : అనుపమ అప్కమింగ్ మూవీ అనౌన్స్మెంట్… ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్

Anupama Parameshwaran : అనుపమ అప్కమింగ్ మూవీ అనౌన్స్మెంట్… ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Anupama Parameshwaran : అనుపమ పరమేశ్వరన్ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఓ ముద్ర వేసుకుంటోంది. ఇప్పుడు తన కెరీర్‌లో మరో ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్‌తో ముందుకు సాగుతోంది. ఈ కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్‌కే గీ ఎంటర్‌టైన్‌మెంట్, బెంచ్‌మార్క్ స్టోరీటెల్లర్స్ కలసి నిర్మిస్తున్నాయి. దర్శకత్వ బాధ్యత ఆర్‌జే షాన్ చేపట్టనున్నారు. నిర్మాతలుగా శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందుతోంది.

షార్ట్ ఫిల్మ్‌లో కూడా కలిసి పనిచేసారు

అనుపమ-ఆర్‌జే షాన్ జోడీ గతంలో ఒక షార్ట్ ఫిల్మ్‌లో కలిసి పనిచేసారు. ఇప్పుడు ఇద్దరూ బిగ్ స్క్రీన్‌పై మళ్లీ జతకావడం ఆసక్తికరంగా మారింది. ఆ షార్ట్ ఫిల్మ్ డిజిటల్ మీడియాలో భారీ హిట్ అయిన నేపథ్యంలో, ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. టైటిల్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అనుపమ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ చేయడం విశేషం. చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపుతూ, ఈ భారీ సైకాలజికల్ థ్రిల్లర్‌ను అధికారికంగా ప్రకటించింది.

నిర్మాణ సంస్థల బ్యాక్‌గ్రౌండ్

Advertisement

ఎస్‌కే గీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇటీవలే “జటాధర” వంటి చిత్రాన్ని నిర్మించి మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణ పనులను విస్తరిస్తోంది. మరో నిర్మాత ప్రేరణ అరోరా గతంలో ‘రుస్తుం’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’, ‘పరి’ వంటి విజయవంతమైన చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ బలమైన నిర్మాణ బృందం ఈ సైకాలజికల్ థ్రిల్లర్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది.

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ హైలైట్స్

ఇక అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే ‘ప్రేమమ్’, ‘కార్తికేయ 2’, ‘రాక్షసుడు’ వంటి హిట్ చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న యంగ్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా ఉన్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో ఆమె సైకాలజికల్ థ్రిల్లర్ జానర్‌లో మరోసారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ అనుపమ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. మే నెలలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ వంటివి కూడా త్వరలో విడుదల కానున్నాయి. అనుపమ, ఆర్‌జే షాన్ కాంబినేషన్ బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Read Also : పెళ్ళాం పోయాక సంతోషపడే మొగుడు… చచ్చినా వదలని ఆత్మ… క్లైమాక్స్ వరకు నవ్వులే

Related News

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

Big Stories

Advertisement
×