E-Paper
Advertisement

Visakha News: అర్ధరాత్రి రణరంగంగా ఏయూ.. ఆపై ఘర్షణలు, బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపు

Visakha News: అర్ధరాత్రి రణరంగంగా ఏయూ.. ఆపై ఘర్షణలు, బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపు
Advertisement

Visakha News: ఆంధ్రా యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? అర్ధరాత్రి రణరంగంగా క్యాంపస్ ఎందుకు మారింది? విద్యార్థి సంఘాలు ఎందుకు భగ్గుమన్నాయి? ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారా? ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లిందా? ఈ క్రమంలో ఏయూ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చాయా? అవుననే అంటున్నారు.

అర్ధరాత్రి రణరంగంగా ఏయూ

Advertisement

ఆంధ్రా యూనివర్సిటీకి రకరకాల సమస్యలు మొదలయ్యాయి. ఏదో విధంగా విద్యార్థులు ఆందోళనకు దిగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఏయూలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరగతుండడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.  మంగళవారం ఏయూ గ్రౌండ్‌లో ఆర్ఎస్ఎస్ మార్చ్ చేస్తోంది. దీనికి అనుమతి ఉందా అని వారిని విద్యార్థి సంఘాలు ప్రశ్నించారు.

ఈ క్రమంలో ఏయూ విద్యార్థులు-ఆర్ఎస్ఎస్ నిర్వాహకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ రణరంగంగా మారింది క్యాంపస్.  ఇటు ఏయూ విద్యార్థులు-అటు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.

Advertisement

ఆర్ఎస్ఎస్ మార్చ్‌ని అడ్డుకున్న విద్యార్థి సంఘాలు

తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ త్రీ టౌన్ పోలీసుస్టేషన్‌లో విద్యార్థి నేతలు ఫిర్యాదు చేశారు. సుమారు వంద మంది విద్యార్థుల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు.  అర్ధరాత్రి ఏయూ విద్యార్ధి సంఘాలు అత్యవసర సమావేశం అయ్యాయి. బుధవారం ఏయూ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. బంద్‌ను విజయవంతం చెయ్యాలని కోరాయి.

రెండు రోజుల కిందట ఏయూలో ఆర్‌ఎస్‌ఎస్‌-ఏబీవీపీ శాఖ సమావేశం జరిగింది. యూనివర్సిటీలో వారు ప్రవేశాన్ని నిరసిస్తూ వర్సిటీ గేటు వద్ద సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కొందరు విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో వీసీ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో వర్సిటీలో ఎబివిపి సమావేశం నిర్వహించేందుకు కొంతమంది వ్యక్తులు వచ్చారు.

ALSO READ: నటుడు మోహన్‌బాబుకు కష్టాలు.. అరెస్టు తప్పదా? ఏం జరిగింది?

ఈ విషయాన్ని గమనించిన ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి నాయకులు వర్సిటీ సెక్యూరిటీ, వీసీకి తెలిపారు. అక్కడి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌-ఎబివిపి నాయకులను బయటకు పంపారు. ఆ తర్వాత సుమారు 40 మంది ఆర్‌ఎస్‌ఎస్‌-ఎబివిపి నాయకులు వర్సిటీ లోపలకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది.

క్యాంపస్‌లో అశాంతిని సృష్టించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌-ఎబివిపి నాయకులు పని చేస్తున్నారని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది వారిని వెళ్లిపోవాలని సూచించారు. వారు రెచ్చిపోయి విద్యార్థులపై దాడికి దిగినట్టు ఆయా సంఘాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడినవారిని వెంటనే గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

 

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×