E-Paper
Advertisement

వివేక్ ఆత్రేయ-బాలకృష్ణ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా?

వివేక్ ఆత్రేయ-బాలకృష్ణ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా?
Advertisement

Ravi Teja : ఒకరికి దక్కాల్సిన అవకాశం మరొకరికి దక్కడం సహజం, ఇక సినీ ఇండస్ట్రీలో అది మరీ సహజం.. గతంలో ఇలా ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు హీరోలు మారి సూపర్ హిట్లు అయ్యాయి కూడా. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ చేయాల్సిన ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్, ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ ఖాతాలోకి వెళ్లిందని. . నటనలోనూ, బాడీ లాంగ్వేజ్‌లోనూ కంప్లీట్ వేర్వేరు స్టైల్ మెయింటేన్ చేసే ఈ ఇద్దరు హీరోల మధ్యలో ఒకే కథ అటూ ఇటూ తిరగడం ఫిలిమ్ సర్కిల్స్ లో ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది.

NBK111 షూటింగ్‌లో బిజీ బిజీగా బాలయ్య 

Advertisement

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సంగతి తెల్సిందే.అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆయన క్రేజ్ అమాంతం ఆకాశానికి చేరింది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 111వ సినిమా (NBK111) షూటింగ్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.. 2023 సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.

also read :ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు ప్రెగ్నెంట్.. వరుణ్ కొత్త సినిమా కథ లీక్.. ట్రైలర్ చూశారా?

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. ఇక ఈ లైనప్ ఇలా ఉండగానే, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నారనే వార్త గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

మెస్మరైజ్ చేసిన సరిపోదా శనివారం

గతేడాది నాని హీరోగా వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమాతో వివేక్ ఆత్రేయ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశాడు.కమర్షియల్ ఎలిమెంట్స్‌కు కొత్త తరహా స్క్రీన్‌ప్లే జోడించి ఆయన అందుకున్న సక్సెస్  ఇండస్ట్రీని మెస్మరైజ్ చేసింది.ఈ క్రమంలోనే బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, ఆయన ఇమేజ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఒక క్రేజీ మాస్ అండ్ ఎమోషనల్ స్టోరీని సిద్ధం చేశాడట వివేక్ .

also read :గోల్డెన్ సీజన్ గోవిందా.. టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ డిజాస్టరస్ సమ్మర్ ఇదేనా?

ఇక దీనికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ మైత్రి మూవీ మేకర్స్ సమక్షంలో జరిగాయి కూడా.పైగా బాలయ్యకు కూడా లైన్ బాగా నచ్చడంతో ఈ క్రేజీ కాంబినేషన్ దాదాపు ఖాయమని, టైటిల్ కురుక్షేత్రం అని నెట్టింట్లో తెగ సర్క్యులేట్ అయింది కూడా.అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకుండానే ఆగిపోయినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వరుసగా ఒప్పుకున్న మిగతా సినిమాల కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే వివేక్ ఆత్రేయ సినిమాకు బ్రేక్ పడిందని ఇన్ సైడ్ టాక్.

బాలయ్య కథ రవితేజకి ఎలా నప్పుతుందో

అయితే ఆ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఎత్తి పరిస్థితుల్లో తెరకెక్కించాలని ఫిక్స్ అయిన వివేక్ మాస్ మహారాజా రవితేజ ని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది.కథ విన్న రవితేజ క్యారెక్టరైజేషన్ నచ్చి వెంటనే సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశాడని సమాచారం. రవితేజ ఎనర్జీకి వివేక్ ఆత్రేయ మార్క్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది మైత్రి మేకర్స్.

also read :టాలీవుడ్‌లో మొదలైన అసలు ‘సినిమా’.. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్.. ‘పెద్ది’ రిలీజ్ అవుతుందా?

ఇక ప్రస్తుతం రవితేజ తన సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ షూటింగ్‌లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ సినిమా షెడ్యూల్స్ ముగిసిన వెంటనే, వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య మార్క్ భారీతనం కోసం రాసుకున్న కథలో రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా వివేక్ కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్లు వినిపిస్తుంది. చూడాలి మరి బాలయ్య వదులుకున్న ఈ కథ రవితేజకి ఎలా నప్పుతుందో !

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×