E-Paper
Advertisement

గోల్డెన్ సీజన్ గోవిందా.. టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ డిజాస్టరస్ సమ్మర్ ఇదేనా?

గోల్డెన్ సీజన్ గోవిందా.. టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ డిజాస్టరస్ సమ్మర్ ఇదేనా?
Advertisement

Boxoffice Crisis :ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే సాలిడ్ కలెక్షన్స్ అన్నట్టుగా ఉండేది.ముఖ్యంగా పెద్ద సినిమాలు బరిలో దిగి వసూళ్ళ సునామీ స్ప్రుష్టించేవి.కాని రాను రాను ఈ సీజన్ కాస్తా డ్రై గా మారడం మొదలైపోయింది. దానికి తోడు ఈ ఏడు మేకర్స్ సరైన ప్లానింగ్ చేయకపోవడం వల్ల బాక్సాఫీస్ బోసిపోవాల్సిన పరిస్థితి.మార్చిలో భారీ అంచనాలతో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో మొదలైన ఈ పరంపర మే చివరి వారం వరకు కొనసాగడం ఇండస్ట్రీకి పెద్ద దెబ్బే.

అసలు నష్టం మీడియం రేంజ్ చిత్రాలకే

Advertisement

జూన్ 4వ తేదీన రాబోయే ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, అది థియేటర్లలోకి వచ్చిన వారం రోజులకే స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కానుండడం పెద్ద మైనస్ కానుంది. ఆ సమయంలో తల్లిదండ్రులంతా అడ్మిషన్లు, భారీ ఫీజుల హడావిడిలో మునిగిపోతారు కాబట్టి, ఆ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉంది. ‘పెద్ది’ పెద్ద సినిమా కాబట్టి ఎలాగోలా గట్టెక్కినా, అసలు నష్టం మీడియం రేంజ్ చిత్రాలకే జరిగింది. బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి సమ్మర్ విండోను మిస్ చేసుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

also read :టాలీవుడ్‌లో మొదలైన అసలు ‘సినిమా’.. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్.. ‘పెద్ది’ రిలీజ్ అవుతుందా?

Advertisement

నిఖిల్ సిద్ధార్థ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’ రకరకాల కారణాలతో వాయిదాలు పడుతూనే వస్తోంది. ఫిబ్రవరి, ఏప్రిల్ అంటూ రెండు మూడు డేట్లు మార్చిన మేకర్స్, ఇప్పుడు హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. కనీసం జూలై లేదా ఆగస్టులోనైనా వస్తుందా అంటే అదీ నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కూడా అంతర్గత ఇష్యూస్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదాల పర్వంలో నలిగిపోతోంది. ఈ ఏడాది అసలు ఆ సినిమా వెండితెరపై కనిపిస్తుందా లేదా అన్నది అనుమానమే.

వెనుకడుగు వేస్తున్న చిన్న సినిమాలు

ఇక భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే, డీసెంట్ బడ్జెట్‌తో క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు కూడా సాహసం చేయలేక వెనకడుగు వేశాయి.అవును ..మంచి బజ్ క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ సినిమాలు అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంలో వెనుకడుగు వేస్తున్నాయి.

also read :ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఇక సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ కూడా జూన్ 19న రావడానికి ప్లాన్ చేసుకుంటే, అఖిల్ అక్కినేని ‘లెనిన్’ చిత్రం జూన్ 26వ తేదీన వస్తానంటూ రెడీ అయింది.నిజంగా ఇవి గనుక మే నెలలో ప్లాన్ చేసుకుని ఉంటె సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా దక్కేది.అలా కాకుండా అందరూ జూన్, జూలై నెలలపై పడడంతో ఇప్పుడు థియేటర్ల యజమానులు పరభాషా డబ్బింగ్ సినిమాలను నెత్తిన పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే, మెగాస్టార్ చిرامజీవి సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విఎఫెక్స్ పనుల పేరుతో కాలయాపన చేస్తూ జూలై 10కి నెట్టబడిందని ఇన్ సైడ్ టాక్.

మరింత డౌన్ ఫాల్ అవడం ఖాయం

ఇక పరిస్థితి ఇలాగే ఉంటే టాలీవుడ్ మార్కెట్ మరింత డౌన్ ఫాల్ అవడం ఖాయం. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ అగ్రిమెంట్లు చేసుకుని థియేటర్ల అద్దెలు కట్టలేక లబో దిబో మంటున్నారు. జూన్ 11న రాబోతున్న ‘సింగ్ గీతం’,జూన్ 18 న వస్తున్న ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’జూలై 3న వస్తున్న ‘నాగబంధం’ వంటివి ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చెప్పలేము. ఈ గ్యాప్‌లో ఇటు తెలుగు సినిమాలు లేక, అటు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి వస్తున్న డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం మన మేకర్ల ప్లానింగ్ లోపమే అని స్పష్టమవుతోంది.

కనీసం ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు కూర్చుని రిలీజ్ క్యాలెండర్‌ను సెట్ చేసుకోకపోతే, రాబోయే పండగ సీజన్లలో కూడా ఇలాంటి క్లాష్‌లు తప్పవు. చూడాలి మరి ఈ బాక్సాఫీస్ భారాన్నిరాబోయే జూన్, జూలై సినిమాలు ఎంతవరకు మోస్తాయో !

also read :ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఈవెంట్.. నేడే భోపాల్‌లో ‘పెద్ది’ హంగామా.. రెహమాన్ టీం లైవ్ పెర్ఫార్మెన్స్!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×