E-Paper
Advertisement

వచ్చే సంక్రాంతికి ‘నందమూరి’ ఊచకోత…బాలయ్య ప్లానింగ్ వేరే లెవల్!

వచ్చే సంక్రాంతికి ‘నందమూరి’ ఊచకోత…బాలయ్య ప్లానింగ్ వేరే లెవల్!
Advertisement

Balakrishna Movies:కుర్ర హీరోలే ఒకవైపు ఏడాదికో ఒక్క సినిమా కూడా డెలివర్ చేయలేకపోతుంటే దబిడి దిబిడే అంటూ వరుస సినిమాలతో దంచి కొట్టేందుకు రెడీ అయిపోయాడు నంద‌మూరి బాల‌కృష్ణ.ఈ మధ్యే ‘అఖండ 2’ అంటూ శివ తాండవం చేసిన బాలయ్య ఇపుడు అదే ఊపులో మరిన్ని సినిమాలని పట్టాలెక్కిస్తున్నాడు.ఈ క్రమంలో ఇప్పటికే NBK111 అంటూ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా మొదలెట్టేసాడు బాలయ్య.ఇక ఈ సినిమా జోరుగా సాగుతుంటే మరో వైపు యంగ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల చెప్పిన ఒక పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాను బాలయ్య ఓకె చేశాడని సమాచారం.

జులై నుంచే మొదలై వచ్చే సంక్రాంతి బరిలో

Advertisement

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘ఉగ్రం, నాంది’ సినిమాలు ఇతని డైరెక్షన్ లో వచ్చినవే.వాటి లాగే ఈ సినిమా కూడా రా అండ్ రియలిస్టిక్ టచ్ తో ఉంటుందని ఇన్ సైడ్ టాక్.అసలే బాలయ్య అంటే పవర్ ఫుల్ డైలాగులకి,అడిపోయే యాక్షన్ సీక్వెన్స్ లకి పెట్టింది పేరు.మరి ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే ఉంటుందా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో వినిపిస్తున్న మరో క్రేజీ అప్ డేట్ ఏంటంటే ఈ సినిమాని జులై నుంచే మొదలై వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నాడట బాలయ్య.

also read:మధుబాల బయోపిక్..‘ఆ స్థాయిని కళ్యాణి ప్రియదర్శన్ అందుకోగలదా.. రిస్క్ చేస్తున్న భన్సాలీ ?

Advertisement

ఇక ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని,దీనికి సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయబోతున్నారని సమాచారం.నిజానికి వచ్చే సంక్రాంతికి NBK111 వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారంతా.ఇపుడు ఈ సినిమాని బరిలోకి దించే ప్లాన్ చేస్తున్నారంటే NBK111 దసరా లేదా దీపావళి బరిలో దిగినా ఆశ్చర్యం లేదు.సో ప్యార్ లల్ గా రెండు సినిమాల్ని సెట్స్ మీద పరిగెత్తించబోతున్నారన్న మాట.దీంతో ఆరు పదులు దాటినా సినిమాల ప్లానింగ్ విషయంలో మా బాలయ్య వేరే లెవల్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

రెండు భాగాలుగా రానున్న సినిమాకి కురుక్షేత్ర అనే టైటిల్

ఇక విజయ్ ప్రాజెక్ట్ సంగతి ఇలా ఉంటె వివేక్ ఆత్రేయ కూడా ఒక క్రేజీ కథ వినిపించాడని రెండు భాగాలుగా రానున్న ఆ సినిమాకి కురుక్షేత్ర అనే టైటిల్ పెట్టనున్నారన్న టాక్ వినిపిస్తుంది.ఇంకోవైపు హరీష్ శంకర్, హనీఫ్ ఆదేని, శ్రీనివాస రాజు లాంటి వాళ్ళు బాలయ్య కోసం చక్కర్లు కొడుతున్న వాళ్ళే.మరి ఇంతటి బిజీ షెడ్యూల్ లో ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.ఇక వచ్చే సంక్రాంతికి రావాలని ఆశ పడుతున్న బాలయ్యకి పోటీగా చిరంజీవితో పాటు శర్వానంద్, వరుణ్ తేజ్ ల సినిమాలు బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నవే.అంటే వచ్చే పొంగల్ దంగల్ మాములుగా ఉండదన్న మాట.ఇక బాలయ్య విషయానికి వస్తే సంక్రాంతి సీజన్‌లో ‘నరసింహ నాయుడు’, ‘లక్ష్మీ నరసింహ’, ‘వీరసింహారెడ్డి’ వంటి సాలిడ్ హిట్స్ ఎన్నో కొట్టాడు బాలయ్య.మరి విజయ్ కనకమేడల తెరకెక్కించే ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి పాత్ర పోషిస్తాడో,బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడో వేచి చూడాల్సిందే.

also read:కృతజ్ఞత లేని టాలీవుడ్…ఆ ఇద్దరు దిగ్గజాలు చనిపోతే ఒక్క హీరో కూడా రాలేదా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×