E-Paper
Advertisement

కృతజ్ఞత లేని టాలీవుడ్…ఆ ఇద్దరు దిగ్గజాలు చనిపోతే ఒక్క హీరో కూడా రాలేదా?

కృతజ్ఞత లేని టాలీవుడ్…ఆ ఇద్దరు దిగ్గజాలు చనిపోతే ఒక్క హీరో కూడా రాలేదా?

Tollywood:చూడు.. నా దగ్గర వేషాలు వేస్తే తోలు వొలిచి చేతిలో పెడతాను జాగ్రత్త!’అంటుంది గుండమ్మకథలో సూర్యకాంతం.
ఇక ‘మడిషన్నాక కూసింత కళా పోషణ ఉండాలా’ అంటాడు ముత్యాల ముగ్గులో రావు గోపాల్రావ్.ఇలా గయ్యాళి తనంతో ఒకరు, విలనిజానికి కేరాఫ్ గా మరొకరు సిల్వర్ స్క్రీన్ ని పై ఏ రేంజ్ లో రెచ్చిపోయారో చెప్పక్కర్లేదు.ఒక దశలో వీళ్ళ డేట్స్ లేకపోతె స్టార్ హీరోల సినిమాలే షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయంటే ఈ ఇద్దరు సినిమాలపై ఇంపాక్ట్ ఎంతగా చూపించారో అర్థం చేసుకోవచ్చు.అలాంటి ఈ ఇద్దరు దిగ్గజాల చివరి జీవితాలలో ఒక విషాదకరమైన పోలిక ఒకటుందన్న సంగతి మీకు తెలుసా..

నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్

అదే వాళ్ళిద్దరూ చనిపోయిన సమయంలో తెలుగు ఇండస్ట్రీ నుండి ఒక్క స్టార్ హీరో కూడా కడసారి చూసేందుకు రాకపోవడమే.రావు గోపాలరావు విషయానికి వస్తే ఆయన వాయిస్ కే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది.ఇక 1975లో ఆయన నటించిన ముత్యాల ముగ్గులోని డైలాగులు ఇప్పటికీ రిపీట్ మోడ్ లో వింటూ ఉంటాం.ఇక ‘భక్త కన్నప్ప’ (1976),’యమగోల’ (1977),’ఖైదీ’ (1983) వంటి ఎన్నో సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ ని తన నటనతో మరో మెట్టు ఎక్కించిన ఈ వెర్సటైల్ యాక్టర్ నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్ గా ఉండేవారు.

also read:అనిల్ రావిపూడికి ‘రామాయణం’ పిచ్చి.. అటు వెంకటేష్, ఇటు యానిమేషన్.. అసలు ఏం జరుగుతోంది?

అల్లు రామలింగయ్య, పి.ఎల్.నారాయణ వంటి వాళ్ళు తప్ప

అలాంటి రావు గోపాల్ రావు 1994,ఆగస్టు 13న చనిపోయినప్పుడు ఆయన అంతిమ యాత్రలో అల్లు రామలింగయ్య,పి.ఎల్.నారాయణ వంటి వాళ్ళు తప్ప ఇండస్ట్రీ నుండి అగ్ర హీరోలు ఎవరూ చివరి చూపుకు రాలేదట.ఇదే విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో బాధ పడుతూ చెప్పుకొచ్చింది ఆయన భార్య కమల కుమారి.ఏంతో మంది స్టార్ హీరో,నిర్మాతల సినిమాలని ఒంటి చేత్తో మోసిన ఈ విలక్షణ నటుడికి ఈ రీతిన చివరి సత్కారం జరగడం నిజంగా బాధాకరమే.

గయ్యాళి అత్తగా కోడళ్ళకి ముచ్చెమటలు పట్టించినా

ఇక ఇదే తరహాలో ఏ అగ్ర హీరో చివరి చూపుకు నోచుకులేకపోయింది మన ప్రియమైన గయ్యాళి అత్త సూర్యకాంతం.’మాయాబజార్’ (1957) నుండి ‘గుండమ్మ కథ’ (1962) వరకు ఈమె లేని సినిమా లేదంటే ఆశ్చర్యం లేదు.ఇక తెరమీద గయ్యాళి అత్తగా కోడళ్ళకి ముచ్చెమటలు పట్టించినా తెర వెనుక ఈమె మనసు వెన్నపూస అన్న సంగతి అందరికీ తెలుసు.ముఖ్యంగా ఆమె తను నటించే సినిమా యూనిట్ వారికి ఒక అన్నపూర్ణ.సినిమా ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తన ఇంటి నుండి భోజనం రావాల్సిందే.అందరికి వడ్డించాల్సిందే.ఇక డబ్బు పట్ల ఎంత ఉదారంగా ఉంటారో బాపు-రమణ వంటి వారికి బాగా తెలుసు.

తమిళనాడు cmగా ఉన్నప్పటికీ వచ్చిన జయలలిత

అయితే ఇంతలా మంచి పేరు,ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న సూర్యకాంతం 1994,డిసెంబర్ 18న చనిపోయినప్పుడు మాత్రం ఇదే ఇండస్ట్రీ నుండి ఒక్క అగ్రహీరో కూడా రాకపోవడం బాధాకరం.అర్థరాత్రి చనిపోయిన సూర్యకాంతాన్ని చూడడానికి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ‘ఎవరైనా వస్తారేమో’ అని ఎదురు చూసిన ఆ కుటుంబ సభ్యులకి నిరాశే ఎదురైంది.అయితే ఇదే సూర్య కాంతం చేతి భోజనం తిన్నాను అన్న కృతజ్ఞతతో తమిళనాడు cmగా ఉన్నప్పటికీ వీలు చేసుకొని మరీ జయలలిత రావడం విశేషం.ఏది ఏమైనా ఎన్నో సినిమాల్లో నటించి,దిగ్గజాలుగా వెలుగొంది ఇలా తమ చివరి రోజుల్లో ఇలా గుర్తింపు లేకుండా వెళ్ళిపోవడం టాలివుడ్ కి మాయని మచ్చే అని చెప్పాలి…

also read:‘ఆంటీ’అంటే రూ.1.5 లక్షల ఫైన్..లండన్ కోర్టు తీర్పుపై అనసూయ రియాక్షన్ వైరల్

Related News

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

Big Stories

×