E-Paper
Advertisement

Amaravathiki Aahwanam Movie Review: అమరావతికి ఆహ్వానం రివ్యూ

Amaravathiki Aahwanam Movie Review: అమరావతికి ఆహ్వానం రివ్యూ
Advertisement

హారర్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటనే ఉంటది. గిప్పుడు మార్కెట్లోకి ‘అమరావతికి ఆహ్వానం’ అని ఒక కొత్త రకం దెయ్యం సినిమా వచ్చింది. చిన్న సినిమానే కానీ, మ్యాటర్ మాత్రం గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది.

సినిమా కథ :

అమరావతి అనే ఒక ఊరు.. అక్కడ ఎవడో తాగుబోతు తనను తాను చంపుకోవడంతో కథ ఖతర్నాక్ ఇంట్రెస్టుతో మొదలైతది. సీన్ కట్ చేస్తే.. మన హీరో ఈశ్వర్ (శివ కంఠంనేని) ఒక పోలీస్ ఆఫీసర్. ఇంట్లో పెళ్లాం భానుమతి (ధన్య బాలకృష్ణ), అల్లరి పిల్లలైన మరదళ్లతో లైఫ్ హ్యాపీగా సాగిపోతుంటది.

Advertisement

కానీ, ఈయన మరదలు భార్గవి (సుప్రిత) కి సోషల్ మీడియా పిచ్చి. ఏదో ఒక వెరైటీ వీడియో తీసి వైరల్ కావాలని ఒక బూత్ బంగ్లాలోకి పోయి వీడియో తీస్తది. అది చూసి ఎవడో అజ్ఞాత వ్యక్తి “అసలు దెయ్యాలను చూపిస్తా.. అమరావతి ఊరికి రండి” అని ఇన్వైట్ చేస్తాడు. ఏదో సరదాగా ఉంటుందని ఫ్యామిలీ అంతా కలిసి ఆ ఊరికి పోతారు. అక్కడికి వెళ్ళాక వాళ్లకు చుక్కలు కనిపిస్తాయి. అసలు ఆ ఊరి జమిందారిణి రాజేశ్వరికి, ఈశ్వర్ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంది? ఆ ఊరిలో ఏం జరిగింది? అనేదే అసలు కథ.

ప్లస్ పాయింట్స్ :

శివ కంఠంనేని పర్ఫార్మెన్స్: హీరో శివ గారు పోలీస్ ఆఫీసర్‌గా చాలా హుందాగా నటించారు. ఫ్యామిలీ సీన్స్‌లో సాఫ్ట్‌గా, సీరియస్ సీన్స్‌లో గంభీరంగా ఇరగదీశారు.

Advertisement

రాజేశ్వరి క్యారెక్టర్ (ఎస్తేర్): సినిమాలో అసలైన ట్విస్ట్ ఎస్తేర్ పాత్రనే. ఆమె నటన, క్యారెక్టర్ డిజైన్ సినిమాకే హైలెట్. ఇది ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే రోల్.

ధన్య & సుప్రిత: ధన్య బాలకృష్ణ తన కళ్ళతోనే భయాన్ని పలికిస్తే, సుప్రిత తన ఎనర్జీతో మెప్పించింది. మిగతా బ్యాచ్ అశోక్ కుమార్, భద్రమ్, జెమినీ సురేష్ అందరూ వాళ్ల పరిధి మేరకు మంచిగా చేశారు.

టెక్నికల్ పవర్: ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఊరి వాతావరణాన్ని భయంకరంగా చూపించింది. ఇక భరద్వాజ్ మ్యూజిక్ అయితే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. బిజీఎం అదిరిపోయింది.

మైనస్ పాయింట్స్ :

కొన్ని చోట్ల హారర్ సీన్స్ పాత సినిమాలను గుర్తు చేసినట్లు అనిపిస్తాయి.

ఫస్టాఫ్ కొంచెం స్లోగా అనిపించినా, సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాక స్పీడ్ అందుకుంటుంది.

అసలు ముచ్చటకు వస్తే :

మొత్తానికి అమరావతికి ఆహ్వానం ఒక పక్కా హారర్ థ్రిల్లర్. దర్శకుడు జీవీకే రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి. అనవసరమైన హంగులు లేకుండా పాయింట్‌కు కట్టుబడి తీసిన సినిమా ఇది. థియేటర్లో ఒక్కసారి గట్టిగా భయపడాలనుకునే వాళ్లకు ఈ బొమ్మ పక్కా నచ్చుతది.

Amaravathiki Aahwanam Movie  Rating :- 2.75/5

Tags

Related News

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

Big Stories

Advertisement
×