E-Paper
Advertisement

Upcoming Movies : ‘ది రాజా సాబ్’ నుంచి రాజ్ బి శెట్టి యాక్షన్ థ్రిల్లర్ వరకు.. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్

Upcoming Movies : ‘ది రాజా సాబ్’ నుంచి రాజ్ బి శెట్టి యాక్షన్ థ్రిల్లర్ వరకు.. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్
Advertisement

Upcoming Movies : ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. హారర్, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ మిక్స్‌తో ఈ సినిమాలను, చూడటం మొదలు పెడితే ఆపలేరు కూడా. తెలుగు సినిమాలతో పాటు, కన్నడ సినిమాలు కూడా వీకెండ్ వచ్చేస్తున్నాయి. మరి ఆ సినిమాల పేర్లు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉన్నాయి ? అనే వివరాలను తెలుడుకుందాం పదండి.

‘ది రాజా సాబ్’ (The Raja Saab)

ప్రభాస్ నటించిన కామెడీ హారర్ చిత్రం ‘ది రాజా సాబ్’. థియేటర్లలో సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా, గ్లోబల్‌గా ₹200 కోట్లు కలెక్ట్ చేసింది. మారుతి డైరెక్షన్ లో సంజయ్ దత్, మాలవికా మోహనన్ వంటి నటులు కూడా నటించారు. ఈ సినిమా JioHotstarలో 2026 ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

పరాశక్తి (Parasakthi) 

Advertisement

ఇది శివకార్తీయేకన్ ప్రధాన పాత్రలో దర్శకురాలు సుధ కొంగర రూపొందించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా. 1960ల నేపథ్యంలో, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో సాగింది ఈ కథ. ఈ సినిమాలో శ్రీ లీల, రవి మోహన్, అధర్వ, ప్రకాష్ బెలవాడి వంటి నటులు కూడా నటించారు. ఈ తమిళ ఒరిజినల్ చిత్రం కన్నడ, తెలుగు , మలయాళంలో కూడా ప్రసారం కానుంది. Zee5 లో ఈ సినిమా 2026 ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

రక్కసపురధోల్ (Rakkasapuradhol) 

రాజ్ బి శెట్టి తన కెరీర్‌లో తొలిసారిగా పోలీసు అధికారిగా నటిస్తున్న చిత్రం రక్కసపురధోల్. ఈ చిత్రం రవి సారంగ తీసిన తొలి సినిమా. ఈ చిత్రంలో గోపాలకృష్ణ దేశ్‌పాండే, అనిరుధ్ భట్, అర్చన కొట్టిగే, జహంగీర్ వంటి నటీలు కూడా నటిస్తున్నారు. ఇది 2026 ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వస్తోంది.

జెసి ది యూనివర్సిటీ (JC The University) 

Advertisement

చేతన్ జయరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య ప్రక్యత్ కథానాయకుడిగా నటించారు. కన్నడ నటుడు డాలీ ధనంజయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి, కొన్ని అనుకోని పరిస్థితులలో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత అతను ఎలా జైలు పాలవుతాడు. జ్యుడీషియల్ కస్టడీలో అతని జీవితం ఎలా ఉంటుంది ? అనే అంశాలతో స్టోరీ ఉంటుంది. ఇందులో భావన రెడ్డి, థ్రిల్లర్ మంజు, విజయ్ సింహా వంటి నటులు కూడా నటించారు. ఇది ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.

నాన్-వెజ్ (Non-Veg)

ఇది కన్నడ, తులు భాషల్లో నిర్మించిన సినిమా. 2026 ఫిబ్రవరి 6న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ‘పిలిబైల్ యమనక్క’ వంటి విజయవంతమైన సినిమాలను అందించిన కె. సూరజ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్కూల్లో అవమానానికి గురైన ఒక టీనేజర్, ఆ తర్వాత ఎదుర్కొనే అంశాలతో స్టోరీ నడుస్తుంది. ఇందులో అథర్వ ప్రకాష్, సంజన బుర్లి ప్రధాన పాత్రల్లో నటించారు.

జై (Jai) 

తన గ్రామానికి కనీస సౌకర్యాల కోసం పోరాడే ఒక సామాన్యుడి కథ ఇది. రాజకీయ వ్యవస్థలోని లోపాలను ఈ సినిమా ప్రశ్నిస్తుంది. ఇది 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. బిగ్ బాస్ కన్నడ 9 విజేత రూపేష్ శెట్టి ఈ సినిమాలో స్థానిక ఎమ్మెల్యేకు నమ్మకమైన అనుచరుడిగా ప్రధాన పాత్రలో నటించాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తులు సినిమాలో అతిధి పాత్రలో నటించగా, ఈ సినిమాలో రాజ్ దీపక్ శెట్టి, అద్వితి శెట్టి, దేవదాస్ కపికాడ్, అరవింద్ బోలార్ వంటి నటులు నటించారు.

Read Also : ఓటీటీలో చావును దగ్గరగా చూపించే సర్వైవల్ థ్రిల్లర్స్… హార్ట్ వీక్ గా ఉన్న వాళ్ళు చూడచూడకూడని సినిమాలు

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×