E-Paper
Advertisement

Credit Card Closing: క్రెడిట్ కార్డు క్లోజింగ్ లేట్ చేస్తున్నారా?.. బ్యాంక్ మీకు డబ్బులు కట్టాలి.. ఆర్బీఐ రూల్స్ ఇవే

Credit Card Closing: క్రెడిట్ కార్డు క్లోజింగ్ లేట్ చేస్తున్నారా?.. బ్యాంక్ మీకు డబ్బులు కట్టాలి.. ఆర్బీఐ రూల్స్ ఇవే
Advertisement

Credit Card Closing: సతీష్ ఓ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. కొన్నాళ్లకు తనకు క్రెడిట్ కార్డు అవసరంలేదని భావించి క్లోజ్ చేయాలని బ్యాంకును కోరాడు. అయితే కార్డు ఇచ్చేటప్పుడు ఫ్రీ కార్డు, ఛార్జీలు పడవని చెప్పిన బ్యాంక్.. క్లోజింగ్ సమయంలో రూ.1500 ఛార్జీల రూపంలో ఖాతాలో అమౌంట్ కట్ చేసింది. ఛార్జీలంటూ క్రెడిట్ కార్డు సిబ్బంది తెలివిగా తప్పించుకున్నారు. బ్యాంకులు క్రెడిట్ కార్డులపై వసూలు చేసే ఇలాంటి అదనపు ఛార్జీలకు ఆర్బీఐ చెక్ పెట్టింది. అది ఎలానో తెలుసుకుందాం.

బ్యాంకుల ట్రాప్

సతీష్ క్రెడిట్ కార్డును క్లోజ్ చేయమని చెప్పినప్పుడు బ్యాంక్ వాళ్లు సరే అని చెప్పి… ప్రాసెస్ పూర్తి అయ్యేందుకు 3 నెలల టైం పడుతుందని చెప్పారు. అనేకసార్లు కాల్స్, ఫాలో అప్స్ తర్వాత చివరికి క్రెడిట్ కార్డు క్లోజ్ చేశారు. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ కు బ్యాంక్ సిబ్బంది సైలెంట్ గా రూ.1,500 వార్షిక ఫీజు వసూలు చేసింది. పైగా వాటిపై మళ్లీ ఛార్జీలు కూడా వసూలు చేసింది. చాలా ఏళ్లుగా బ్యాంకులు ఈ ట్రిక్ ఉపయోగిస్తు్న్నాయి. క్రెడిట్ కార్డు క్లోజింగ్ ను ఆలస్యం చేయడం, అందుకు ఛార్జీలు వసూలు చేయడం అలవాటుగా మారింది.

ఆర్బీఐ నిబంధనలు

Advertisement

ఈ తరహా ఘటనలకు ఆర్‌బీఐ చెక్ పెట్టింది. నిబంధనలను మార్పు చేసి కస్టమర్ చేతికి మూడు శక్తివంతమైన నిబంధనలను ఇచ్చింది. కస్టమర్ అభ్యర్థన మేరకు క్రెడిట్ కార్డును 7 రోజుల్లోపు క్లోజ్ చేయాలి. 7 రోజుల్లో కార్డు క్లోజ్ చేయకపోతే.. ఆ పైన ప్రతి రోజుకు రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల ఆలస్యానికి కస్టమర్ కు రూ. 15,000 పరిహారం చెల్లించాలి.

ఆటో ఈఎంఐ నో ఛాన్స్

గతంలో, బ్యాంకులు కస్టమర్ కొనుగోళ్లను EMIలుగా మార్చేసేవి. ఇప్పుడు కస్టమర్ కు తెలియకుండా ఆటో ఈఎంఐగా మార్చడం చట్టవిరుద్ధం. కస్టమర్ రాత పూర్వక అనుమతి లేకుండా బ్యాంకులు ఈఎంఐలోకి మార్చడానికి వీలులేదు. ఏదైనా మోసం జరిగి కార్డులో అమౌంట్ కట్ అయితే, ఆ మోసాన్ని 3 రోజుల్లోపు బ్యాంకుకు రిపోర్టు చేయాలి. ఇలా చేస్తే ఆ మోసానికి కస్టమర్ ఎలా బాధ్యత వహించనక్కర్లేదు. రూపాయి కూడా చెల్లించవలసిన అవసరంలేదు.

Advertisement

Also Read: ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా? క్రెడిట్‌ కార్డులతో కిరాణా బిల్లులను తగ్గించుకోండిలా..

ఈ మెయిల్ లో ట్రాక్

క్రెడిట్ కార్డు క్లోజింగ్ లో కస్టమర్ చేయాల్సిందల్లా ఈ-మెయిల్ ద్వారా కార్డు క్లోజర్ ను ఫాలో అప్ చేయాలి. రిఫరెన్స్ నంబర్లను సేవ్ చేయడం, 7 రోజుల గడువును ట్రాక్ చేయడం, ఆలస్యమైతే జరిమానా గురించి తెలియజేయాలి.

Related News

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

కస్టమర్లకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, మార్కెట్లో ఇప్పుడు ఎంతంటే..

ఇంజినీరింగ్‌లో 11 బ్యాక్‌లాగ్స్.. కట్ చేస్తే రూ.50 లక్షల ప్యాకేజీ జాబ్.. సక్సెస్ స్టోరీ

హైదరాబాద్ నుంచి Zomato అవుట్? 250 మంది ఉద్యోగుల తొలగింపు?

డబ్బు సంపాదించడానికి డిగ్రీలు అవసరం లేదు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే ఈ కెరీర్లు బెటర్

బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×