Vijay Birthday: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ప్రముఖ నిర్మాత విజయ్ సన్నిహితుడు బన్నీ వాస్ చేసిన ట్వీట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, విజయ్ రాబోయే చిత్రాల గురించి కూడా మాట్లాడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బన్నీ వాస్ తన ట్వీట్‌లో విజయ్‌ని “Gem of a Person” అని కొనియాడారు. విజయ్‌లో ఉన్న ప్యాషన్, నటన పట్ల ఉన్న ఆ “మ్యాడ్నెస్” త్వరలోనే సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌లుగా మారాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది విజయ్‌కి మరింత విజయాన్ని, సంతోషాన్ని అందించాలని ఆయన కోరుకున్నారు.
Read also-విజయ్ దేవరకొండ పుట్టిన రోజు స్పెషల్.. ఈ విషయాలు మీకు అస్సలు తెలిసుండవు..
విజయ్ లైనప్ లో ఉన్న మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు సమీప భవిష్యత్ లో విజయ్ ఏ స్థాయిలో ఉండబోతున్నాడు అనేది హింట్ ఇస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో దర్శకుడు రవికిరణ్ కోలా రూపొందిస్తున్న రౌడీ జనార్థన మూవీ విజయ్ లోని మాస్ యాంగిల్ ను కంప్లీట్ గా తెరపైకి తీసుకురానుంది. ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ లో రౌడీ జనార్థన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మాణంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్న రణబాలి సినిమా భాషలకు అతీతంగా మోస్ట్ అవేటెడ్ మూవీగా క్రేజ్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ టైటిల్ గ్లింప్స్, ఏందయ్యా సామీ పాట వైరల్ గా మారాయి. “రణబాలి”తో విజయ్, రశ్మిక జోడి మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక తాజాగా ప్రకటించిన శౌర్యువ్, వైరా బ్యానర్ మూవీతో విజయ్ ఇండియన్ సినిమాను మరో ముందడుగు వేసేలా చేశారు. ఈ సినిమాకు టాప్ హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటం విశేషం. వారణాసి, రాకా వంటి ప్రెస్టీజియస్ మూవీస్ తో విజయ్, శౌర్యువ్ మూవీకి పోలికలు వచ్చాయి.
ఇదంతా కేవలం పదిహేనేళ్ల కెరీర్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఒక ఔట్ సైడర్ గా ఇండస్ట్రీకి వచ్చి విజయ్ దేవరకొండ సాధించిన విజయాలు. ఆయన మాటల్లో వింటే – హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం నాకు మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ప్రతి సందర్భంలో ప్రేమించే ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. ప్రతి ఇండస్ట్రీ కొత్త ప్రయత్నం చేసేందుకు స్ట్రగుల్ పడాలి అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు అంటారు విజయ్.
Wishing a very Happy Birthday to our Dear Vijay @TheDeverakonda!❤️
A Gem of a Person. There is no doubt about it. I hope all your passion and Madness turns into a sensational blockbuster. All the best for #RowdyJanardhana & #Ranabaali 💥
This year will bring more happiness,… pic.twitter.com/LTnl7LaDf4
— Bunny Vas (@TheBunnyVas) May 9, 2026