E-Paper
Advertisement

విజయ్ దేవరకొండ పుట్టిన రోజు స్పెషల్.. ఈ విషయాలు మీకు అస్సలు తెలిసుండవు..

విజయ్ దేవరకొండ పుట్టిన రోజు స్పెషల్.. ఈ విషయాలు మీకు అస్సలు తెలిసుండవు..
Advertisement

Vijay Deverakonda: స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ సినిమా సాధించిన సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ జయాపజయాలకు అతీతంగా విజయ్ దేవరకొండ క్రేజ్ ఎవరూ కదిలించలేని, శంకించలేని స్థాయికి చేరుకున్నట్లు ఆయన లైనప్ చూస్తే తెలుస్తోంది. రౌడీ జనార్థన, రణబాలి, శౌర్యువ్, వైరా బ్యానర్ కొత్త సినిమా.. ఈ మూడు చిత్రాలు ఏమాత్రం మారని విజయ్ స్టార్ డమ్, రేంజ్ ను చూపిస్తున్నాయి. స్టార్ గా తను ఎదగడమే కాదు తన ఆకర్షణతో తెలుగు సినిమాను కూడా మరింత ఎత్తుకి తీసుకెళ్తున్నాడు విజయ్.

Read also-భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి సెలీనా జైట్లీ.. నష్టపరిహారం ఎంతంటే?

Advertisement

నిర్మాతలు విజయ్ స్టార్ డమ్ ను, థియేటర్ పుల్లింగ్ క్రేజ్ ను, ఆయన స్టామినాను నమ్ముతున్నారు. దర్శకులు తాము ఊహించుకున్న పాత్రలను విజయ్ సమర్థవంతంగా పోషించగలడని, ఆ పాత్రలకు లైఫ్ ఇవ్వగలడని విశ్వసిస్తున్నారు. ఫలితంగానే ఇంత వెర్సటైల్, భారీ మూవీస్ ఆయనతో అనౌన్స్ చేస్తున్నారు. ఒక సినిమాను స్క్రిప్ట్ స్థాయిలోనే ఓన్ చేసుకుని, ఆ సినిమా కోసం ఎంతైనా కష్టపడే విజయ్ తత్వం, ప్యాషన్ మేకర్స్ కు ఎనలేని నమ్మకాన్ని కలిగిస్తుంటాయి.

విజయ్ కెరీర్ ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మూవీ లవర్స్ కు ఆయన ఫిల్మోగ్రఫీలో 90 పర్సెంట్ ఫేవరేట్ మూవీస్ ఉంటాయి. అతి తక్కువ కాలంలో పాన్ ఇండియా ఆడియెన్స్ ఆదరణ, ప్రేమ పొందడం విజయ్ ప్రత్యేకత. పెళ్లి చూపులు మూవీ విజయ్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. అర్జున్ రెడ్డి చిత్రంతో ఆయన టాక్ ఆఫ్ ది పాన్ ఇండియా అయ్యారు. ఆయన పర్ ఫార్మెన్స్ గురించి బాలీవుడ్ స్టార్స్ స్పందించారు. తమ ఫేవరేట్ యాక్టర్ అంటూ ఓపెన్ గా చెప్పుకున్నారు. విజయ్ లోని ఫైర్, డెడికేషన్, సడలని ఏకాగ్రత ఇవే ఆయనను స్టార్ గా నిలబెట్టాయి. టాక్సీవాలా విజయ్ కు మరో సూపర్ హిట్ ఇస్తే..గీత గోవిందం ఆయన కెరీర్ లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం విజయ్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను సకుటుంబ ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చాయి. కల్కి చిత్రంలో అర్జునుడిగా మెరిశారు విజయ్ దేవరకొండ. ఆయనది అతిథి పాత్రైనా ఆ క్యారెక్టర్ గ్లింప్స్, స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యూచర్ లో ఎవరైనా మేకర్ మహాభారతంపై సినిమా చేస్తే అర్జునుడిగా విజయ్ దేవరకొండ పర్పెక్ట్ అనే ప్రశంసలు దక్కాయి. కింగ్డమ్ సినిమా విజయ్ ని కొత్తగా తెరపై ఆవిష్కరించింది.

Advertisement

ఇటీవలే విజయ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు, కోస్టార్ రశ్మికను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించింది. విరోష్ పెళ్లికి సంబంధించిన ప్రతి విశేషం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధాని మోదీ ఆశీస్సులతో పాటు ఎందరో ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపారవేత్తలు, వివిధ రాష్ట్రాల అభిమానులు, ప్రజలు విరోష్ ను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. తమ పెళ్లి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ చేశారు విజయ్, రశ్మిక జంట. సొంత ఊరు అంటే విజయ్ కు చాలా ఇష్టం. నాగర్ కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం తుమ్మన్ పేట విజయ్ సొంతూరు. పెళ్లయ్యాక తుమ్మన్ పేట వెళ్లి అక్కడి గ్రామ ప్రజల ఆశీస్సులు తీసుకున్నారు విజయ్, రశ్మిక జంట. తుమ్మన్ పేట ప్రభుత్వ పాఠశాలలో చదివే 9, 10 వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభ కనబర్చి మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తానని విజయ్ ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అచ్చంపేట డివిజన్ లోని 44 పాఠశాలల్లో ఈ స్కాలర్ షిప్స్ ఇస్తామని ఆయన తెలిపారు. విజయ్ చేపట్టిన ఈ ఛారిటీ కార్యక్రమం పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.

విజయ్ లైనప్ లో ఉన్న మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు సమీప భవిష్యత్ లో విజయ్ ఏ స్థాయిలో ఉండబోతున్నాడు అనేది హింట్ ఇస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో దర్శకుడు రవికిరణ్ కోలా రూపొందిస్తున్న రౌడీ జనార్థన మూవీ విజయ్ లోని మాస్ యాంగిల్ ను కంప్లీట్ గా తెరపైకి తీసుకురానుంది. ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ లో రౌడీ జనార్థన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మాణంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్న రణబాలి సినిమా భాషలకు అతీతంగా మోస్ట్ అవేటెడ్ మూవీగా క్రేజ్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ టైటిల్ గ్లింప్స్, ఏందయ్యా సామీ పాట వైరల్ గా మారాయి. “రణబాలి”తో విజయ్, రశ్మిక జోడి మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇక తాజాగా ప్రకటించిన శౌర్యువ్, వైరా బ్యానర్ మూవీతో విజయ్ ఇండియన్ సినిమాను మరో ముందడుగు వేసేలా చేశారు. ఈ సినిమాకు టాప్ హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటం విశేషం. వారణాసి, రాకా వంటి ప్రెస్టీజియస్ మూవీస్ తో విజయ్, శౌర్యువ్ మూవీకి పోలికలు వచ్చాయి.

Read also-కొండల్లో ఇరుక్కుపోయిన స్వయంభు టీమ్.. రెండు రోజుల పాటు అడవిలోనే?

ఇదంతా కేవలం పదిహేనేళ్ల కెరీర్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఒక ఔట్ సైడర్ గా ఇండస్ట్రీకి వచ్చి విజయ్ దేవరకొండ సాధించిన విజయాలు. ఆయన మాటల్లో వింటే – హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం నాకు మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ప్రతి సందర్భంలో ప్రేమించే ఫ్యాన్స్ ఉండటం నా అదృష్టం. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. ప్రతి ఇండస్ట్రీ కొత్త ప్రయత్నం చేసేందుకు స్ట్రగుల్ పడాలి అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు అంటారు విజయ్.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×