E-Paper
Advertisement

Carmeni Selvam: ఏప్రిల్ 3 లిస్ట్‌లోకి హై స్టేక్స్ డ్రామా.. వివరాలివే!

Carmeni Selvam: ఏప్రిల్ 3 లిస్ట్‌లోకి హై స్టేక్స్ డ్రామా.. వివరాలివే!
Advertisement

Carmeni Selvam: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం.. సినిమాల విడుదలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ‘టాక్సిక్’ మూవీ వాయిదా పడిన విషయం తెలిసిందే. మార్చిలో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు కొన్ని ఏప్రిల్‌కి వెళ్లిపోయాయి. మొత్తంగా అయితే సినిమా రిలీజ్‌ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్ 3న థియేటర్లలోకి వచ్చేందుకు.. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న హై స్టేక్స్ డ్రామా సిద్ధమవుతోంది. ఆల్రెడీ ఏప్రిల్ 3న విడుదలయ్యేందుకు శర్వానంద్ ‘బైకర్’ (Biker), సంగీత్ శోభన్ ‘రాకాస’ (Rakasa) రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ లిస్ట్‌లోకి చేరిన సినిమా పేరు ఏంటేంటే.. ‘కార్మేని సెల్వం’ (Carmeni Selvam). పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

Also Read- Anantha Sriram: చిరు, చరణ్‌ల ప్రేమ ఎలా ఉంటుందంటే?

పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్

Advertisement

విలక్షణ నటుడు సముద్రఖని (Samuthirakani) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరింది. దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read- Niharika Konidela: బ్లాక్ అవుట్ ఫిట్ లో కిల్లింగ్ పోజులతో మెగా డాటర్!

ఒక సాధారణ మనిషి కథ

Advertisement

ఈ చిత్ర కాన్సెప్ట్ ఏంటంటే.. నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు? అనే అంశాన్ని భావోద్వేగభరితంగా దర్శకుడు చూపించబోతున్నారు. ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ, జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా ఈ సినిమా ఉండనుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ .. ‘కార్మేని సెల్వం’ ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటంతో.. ఈ కథ భారీ స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నామని తెలిపారు.

Also Read- Vrushakarma Glimpse: ‘వృషకర్మ’ గ్లింప్స్ వచ్చేశాయ్.. నాగచైతన్య ఈ సారి హిట్ కొట్టేసేలా ఉన్నాడు..

Related News

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

Big Stories

Advertisement
×