Bandla Ganesh: బండ్ల గణేష్ …చిన్న కమెడియన్ గా మొదలైన ఈయన కెరీర్ క్రమంగా స్టార్ హీరోలతో సినిమాలని నిర్మించేంత స్థాయికి వెళ్ళిన సంగతి తెల్సిందే.ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా’,టెంపర్ రామ్ చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా.ఇక ఈయన గారి స్పీచుల కుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.అయితే గత కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరం అయిన బండ్ల తన కెరీర్ మొదట్లో ఎదుర్కున్న అవమానాలని ఒక ఇంటర్వ్యూలో బయటపెడుతూ ఎమోషనల్ అయిపోయాడు.
ఊహించని విధంగా చెప్పుతో దాడి
2004 ఏప్రిల్ 17వ తేదీన సౌందర్య కరీంనగర్ ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజే తనకు ఈ అవమానం జరిగిందని చెప్పుకొచ్చాడు.తను చనిపోయిన రోజు ఇండస్ట్రీ అంతా బాధలో ఉందని,అయితే అదే రోజు సాయంత్రం మరో నటుడితో కలిసి ఒక ప్రముఖ వ్యక్తిని కలవడానికి వెళ్లానని, అప్పట్లో చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో, కేవలం పరిచయాల కోసం సెట్స్‌కు వెళ్లడం ఆయనకు అలవాటని తెలిపాడు.ఇక అలా వెళ్లి ఎంతో వినయంగా చేతులు కట్టుకుని నిలబడిన ఉన్న సమయంలో అక్కడున్న ఒక పెద్ద మనిషి ఊహించని విధంగా చెప్పుతో తనపై దాడి చేశాడని తనకి జరిగిన అవమానాన్ని ఓపెన్ గా బయటపెట్టేశాడు. దేవుడి మీద ఒట్టేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నానంటూ బండ్ల గణేష్ ఆరోజు తనకి జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకొని బాధ పడ్డాడు.
డబ్బు, హోదా లేకపోవడం వల్లే
అయితే ఆ వ్యక్తి చెడ్డవాడు కాదని, వ్యక్తిగత టెన్షన్లు లేదా ఎవరితోనో జరిగిన గొడవ వల్ల వచ్చిన కోపాన్ని తనపై చూపించాడని, మరుసటి రోజే ఆయన క్షమాపణలు కూడా చెప్పారని బండ్ల పేర్కొన్నారు. మనుషులు కోపం వస్తే విలువ లేని వస్తువులను పగలగొట్టినట్టు, ఆ రోజు తన దగ్గర డబ్బు, హోదా లేకపోవడం వల్లే తనను ఒక చిన్నవాడిగా చూసి అలా ప్రవర్తించారని ఆయన విశ్లేషించారు.
also read :ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు ప్రెగ్నెంట్.. వరుణ్ కొత్త సినిమా కథ లీక్.. ట్రైలర్ చూశారా?
కానీ ఆ అవమానమే బండ్ల గణేష్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. అక్కడి నుంచి బయటకు రాగానే తనతో ఉన్న వ్యక్తితో “నా దగ్గర డబ్బు లేదనే కదా ఆయన నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆ వ్యక్తి కంటే వందల రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా, లేకపోతే నా పేరు గణేష్ కాదు” అని శపథం చేశారు. అన్నట్టుగానే 2009లో రవితేజ ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ‘తీన్‌మార్’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ లాంటి క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి టాలీవుడ్‌ను శాసించే స్థాయికి ఎదిగారు.
బండ్ల కామెంట్స్ పై ఎవరైనా రియాక్ట్ అవుతారేమో
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతుండటంతో, ఇంతకీ సౌందర్య చనిపోయిన రోజున బండ్ల గణేష్‌ను అంతలా అవమానించిన ఆ టాలీవుడ్ పెద్ద మనిషి ఎవరు అనే దానిపై నెటిజన్లు తీవ్రంగా ఆరాలు తీస్తున్నారు. ఆ సమయంలో ఆయన ఏ సినిమా షూటింగ్‌లో ఉన్నారు, ఎవరిని కలిశారు అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు నెటిజనులు.చూడాలి మరి బండ్ల కామెంట్స్ పై ఎవరైనా రియాక్ట్ అవుతారేమో !
also read :చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారా? పెద్ది ఆపితే ఆమరణ దీక్షేఅంటున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్