BigTV English

Chiranjeevi: చరణ్ 18 ఏళ్ల సినీ కెరియర్.. తండ్రిగా ఆ క్షణం మర్చిపోలేను.. చిరు ఎమోషనల్ పోస్ట్!

Chiranjeevi: చరణ్ 18 ఏళ్ల సినీ కెరియర్.. తండ్రిగా ఆ క్షణం మర్చిపోలేను.. చిరు ఎమోషనల్ పోస్ట్!

Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్న చిరంజీవి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 18 సంవత్సరాలు కావడంతో ఎంతోమంది అభిమానులు సినిమా సెలబ్రిటీలు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.


చిరుతతో మొదలైన ప్రయాణం..

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన కుమారుడు రాంచరణ్ 18 సంవత్సరాల సినీ కెరియర్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..”చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం “చిరుత”తో మొదలైన నీ సినీ ప్రయాణం నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను”.

నాన్నగా ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను…

“నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతుంటా. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో దేవుడి దీవెనలతో మరెన్నో శిఖరాల నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ విజయోస్తు..!” అంటూ చిరంజీవి రామ్ చరణ్ సినీ ప్రస్థానం గురించి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక 18 సంవత్సరాల సినీ కెరియర్ లో రాంచరణ్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు.


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేశాయి. 18 సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పెద్ది చిత్రం నుంచి రామ్ చరణ్ కి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారు.

Also Read: Akhanda 2 : బాలయ్య అఖండ 2 అప్డేట్… పనిలో పనిగా వారికి థమన్ వార్నింగ్

Related News

Sujeeth: ఓజీ యూనివర్స్ నుంచి మరో అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా!

Karthik Varma: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. సందడి చేసిన సినీ సెలబ్రిటీలు!

The Raja Saab Business: రాజాసాబ్ బిజినెస్… ఓజీని దాటిస్తుందే?

Akhanda 2 : బాలయ్య అఖండ 2 అప్డేట్… పనిలో పనిగా వారికి థమన్ వార్నింగ్

OG Movie: ఓజీ నిర్మాతలకు షాక్… కోర్టు ధిక్కరణ కేసు

Euphoria: నేటి తరం యువత కోసమే గుణశేఖర్ యుఫోరియా.. స్టోరీ లైన్ ఇదేనా!

Tripti dimri: అతని వల్ల నా లైఫ్ 360° తిరుగుతోంది..నటి ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

×