BigTV English

The Raja Saab Business: రాజాసాబ్ బిజినెస్… ఓజీని దాటిస్తుందే?

The Raja Saab Business: రాజాసాబ్ బిజినెస్… ఓజీని దాటిస్తుందే?

The Raja Saab Business: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’. మారుతి (Maruti) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మారుతి ఇందులో ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూపించడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లోనే తొలి హారర్ కామెడీ జానర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ముగ్గురు హీరోయిన్లు.. పైగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ లాంటి వాళ్ళు ఇందులో భాగమవడంతో ఈ సినిమాపై అటు ఫ్యాన్స్ లోనే కాదు ఇటు సినీ లవర్స్ లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. పైగా ప్రభాస్ ను హారర్ గెటప్ లో చూపించబోతున్నారు. కాబట్టి ఆయన ఇందులో ఎలా నటించారు అనే విషయంపై కూడా మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.


ఓజీ కలెక్షన్స్ ను ది రాజాసాబ్ బిజినెస్ తోనే దాటేస్తుందా?

అందులో భాగంగానే ప్రేక్షకుల అభిరుచిని, వారి ఎగ్జాట్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని బిజినెస్ కూడా బాగా జరిగే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఓజీ సినిమా కలెక్షన్ల కంటే కూడా ది రాజాసాబ్ సినిమా బిజినెస్ చేస్తుందని చెప్పడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG) సినిమా విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్ చూసి ఏరియా వారీగా డిస్ట్రిబ్యూటర్లు కూడా రాజాసాబ్ పై అంచనాలు పెంచేశారు. ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా దాదాపు రూ.200 కోట్లకు చేరుకుంటుందని, రెండు రాష్ట్రాలలో NRA మాత్రమే ఉంటుందని అంచనాలు పెంచుతున్నారు. మొత్తానికైతే ప్రభాస్ స్టార్ డంను దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ బిజినెస్ ఓజీ మూవీ కలెక్షన్లను దాటేస్తుంది అని సినీ ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమాకి ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో చూడాలి.


ALSO READ:Bigg Boss 9 Promo: ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందా?
ది రాజాసాబ్ సినిమా విశేషాలు..

ది రాజాసాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ , వివేక కూచిబోట్ల నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీతారాగణం మధ్య డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడి వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న విడుదల చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఓజీ కలెక్షన్స్..

ప్రీమియర్స్ తోనే భారీగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక మూడు రోజుల్లోనే రూ.210 కోట్ల క్లబ్లో చేరి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచిపోయింది. ప్రస్తుతం అక్టోబర్ 2 వరకు ఈ సినిమాకి పోటీగా మరో చిత్రం లేకపోవడం వల్ల ఈ సినిమా అప్పటివరకు థియేటర్లలోనే రన్ అవుతుంది. దీనికి తోడు సెలవులు కూడా కావడంతో ఈ సినిమాకు మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..ఏది ఏమైనా ఈ కలెక్షన్లను ఇప్పుడు ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే వసూలు చేస్తుందని ఇటు సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

Related News

Spirit: ప్రభాస్ కు ఫాదర్ గా మెగాస్టార్, అలా ఎలా సెట్ చేశావ్ వంగా?

Sujeeth: ఓజీ యూనివర్స్ నుంచి మరో అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా!

Karthik Varma: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. సందడి చేసిన సినీ సెలబ్రిటీలు!

Chiranjeevi: చరణ్ 18 ఏళ్ల సినీ కెరియర్.. తండ్రిగా ఆ క్షణం మర్చిపోలేను.. చిరు ఎమోషనల్ పోస్ట్!

Akhanda 2 : బాలయ్య అఖండ 2 అప్డేట్… పనిలో పనిగా వారికి థమన్ వార్నింగ్

OG Movie: ఓజీ నిర్మాతలకు షాక్… కోర్టు ధిక్కరణ కేసు

Euphoria: నేటి తరం యువత కోసమే గుణశేఖర్ యుఫోరియా.. స్టోరీ లైన్ ఇదేనా!

Big Stories

×