Ustaad Bhagat Singh Review: ‘గబ్బర్ సింగ్’ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ‘ఉస్తాద్..’ పై ఎటువంటి అంచనాలు లేవు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కాంబినేషన్ కి తగ్గట్టు ఉందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి.
Read also-Movie updates: బిగ్ సినిమా ఫటాఫట్..సెన్సేషనల్ అప్‌డేట్స్
భగత్ సింగ్(పవన్ కళ్యాణ్) అనాధ. అతన్ని చేరదీసి భగత్ సింగ్ అంటూ నామకరణం చేస్తాడు చంద్రశేఖర్ రావు(కె ఎస్ రవికుమార్). ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో పెళ్లి కూడా చేసుకోకుండా సీఎం వరకు ఎదుగుతాడు చంద్రశేఖర్ రావు. అయితే ఒకసారి అతనిపై పెద్ద దాడి జరుగుతుంది. దీంతో రంగంలోకి దిగుతాడు భగత్ సింగ్. తర్వాత సీఎం పై దాడి చేయించింది నల్లా నాగప్ప అని తెలుసుకుంటాడు. అతనితో శత్రుత్వం ఏర్పడుతుంది. మరోపక్క గురువు చంద్రశేఖర్ రావుని కాపాడుకునేందుకు భగత్ సింగ్ ఏ రేంజ్..కి వెళ్ళాడు.? నల్లా నాగప్ప వెనుక ఉన్నది ఎవరు? మధ్యలో శ్లోకా(రాశీ ఖన్నా) లీల(శ్రీలీల) పాత్రలు ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై మొదటి నుండి ఎటువంటి హైప్ లేదు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ కాంబో అయినప్పటికీ… ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు. అందువల్ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓ మిడ్ రేంజ్ హీరో సినిమాలానే రిలీజ్ అయ్యింది. కాకపోతే పవన్ ఫ్యాన్స్ కి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కదా అనే నమ్మకం దర్శకుడు హరీష్ శంకర్ పై ఉంది. అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి పెద్ద బలంగా మారింది. అయితే కథ పరమ రొటీన్ గా ఉంది. దశాబ్ద కాలం క్రితమే చాలా మంది దర్శకులు వాడేసిన టెంప్లేట్ ఫాలో అవుతూ చేసిన సినిమాలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ లో కొన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా అలరిస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ కి కొన్ని పాస్ మార్కులు పడతాయి. సెకండాఫ్ లో వచ్చే లవ్ సీన్స్ వంటివి కూడా బాగానే ఉంటాయి.యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. చెప్పుకోవడానికి ఎన్ని హంగులు ఉన్నప్పటికీ.. బలమైన కంటెంట్ లేనప్పుడు కామన్ ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అవ్వరు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో అదే లోటు. హీరో అందుబాటులో ఉండి ఇంకొన్ని డేట్స్ ఇచ్చి ఉంటే.. దర్శకుడు రైటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉండేవాడేమో. అలాంటి అవకాశం లేకపోవడం వల్ల చాట్ జీపీటీని ఓ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అడిగి.. దానినే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు ఉన్నాడు. అయితే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ మాత్రం ‘గుంటూరు కారం’ ‘ఓజి’ సినిమాలకి మిగిలిపోయిన ట్యూన్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి వాడేసినట్టు ఉన్నాడు.
Read also-Vijay Deverakonda: రణవీర్, ఆదిత్య ధర్‌ల గురించి విజయ్ దేవరకొండ మామూలుగా ఎత్తలేదుగా..
నటీనటుల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. డాన్సులు, పంచ్ డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్.. ఇలా అన్నిటిలో తన బెస్ట్ ఇచ్చాడు. రాశీ ఖన్నా ఈ సినిమాలో ఎందుకు ఉందో జనాలకి తెలీదు. కథ కూడా వినకుండా ఒప్పుకుంటే ఇలాంటి పాత్రలే వస్తాయి అనుకోవాలి. శ్రీలీల సెకండాఫ్ లో వస్తుంది. ఆమె బాగానే చేసింది. కానీ పవన్ కళ్యాణ్ పక్కన చిన్న పిల్లలా కనిపించడం ఒక మైనస్.తమిళ స్టార్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. తెలుగు జనాలకి ఇతనెవరో తెలీకపోవడం వల్ల.. ఆ పాత్రతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పార్తీబన్ విలనిజం బాగుంది. కానీ ఆ పాత్రలో డెప్త్ లేదు. మిగతా నటీనటుల పాత్రలు పెద్దగా గుర్తుండవు.
మొత్తంగా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ …. ‘గబ్బర్ సింగ్’ రేంజ్లో అయితే లేదు. కానీ ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కంటే బెటర్ అనిపిస్తుంది. ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది.