E-Paper
Advertisement

Electric Coil Stove: పాతకాలం స్టౌవ్‌లు మళ్లీ ట్రెండ్‌లోకి ! కారణం తెలుసుకుంటే షాక్ అవుతారు

Electric Coil Stove: పాతకాలం స్టౌవ్‌లు మళ్లీ ట్రెండ్‌లోకి ! కారణం తెలుసుకుంటే షాక్ అవుతారు
Advertisement

Electric Coil Stove: ఎలక్ట్రిక్ కాయిల్ స్టౌవ్స్ ఇప్పుడు బడ్జెట్ ధరలొనే లభిస్తున్నాయి. ఇండక్షన్ లాగా దీని కోసం ప్రత్యేక పాత్రలు అవసరం లేకుండా.. సాధారణంగా ఇంట్లో వాడే ఏ పాత్రలనైనా దీనిపై వాడుకోవచ్చు. తక్కువ ధర, సింపుల్ డిజైన్, ఎక్కడైనా ఈజీగా ఉపయోగించగలిగే వీలు వల్ల ఇవి స్టూడెంట్స్, చిన్న కుటుంబాలు, హాస్టల్స్‌లో చాలా పాపులర్ అయ్యాయి. 3 బెస్ట్ ఎలక్ట్రిక్ కాయిల్ స్టౌవ్స్ గురించి, వాటి ఫీచర్స్, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ కాయిల్ స్టౌవ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. “ప్లగ్ పెట్టి వాడే స్టౌవ్”. ఇండక్షన్ స్టౌవ్‌లాగా ప్రత్యేక పాత్రలు దీనికి అవసరం ఉండవు. మీ ఇంట్లో ఉన్న సాధారణ మెటల్ పాత్రలతోనే వంట చేసుకోవచ్చు. అందుకే ఇది చాలా మందికి సులభమైన , కన్వీనియంట్ ఆప్షన్‌గా కూడా మారింది. మార్కెట్లో ఎన్నో ఎలక్ట్రిక్ స్టౌ మోడల్స్ ఉన్నా, బడ్జెట్ , వాడకాన్ని బట్టి కొన్ని ఈ మోడల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో టాప్ 3..

Advertisement

WELLBERG 1000W:

ఇది ఎలక్ట్రిక్ కాయిల్ స్టౌవ్ బడ్జెట్‌లో మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇది తక్కువ పవర్‌తో పని చేస్తుంది కాబట్టి కరెంట్ వాడకం కూడా తక్కువగా ఉంటుంది. చిన్న వంటల కోసం, ఉదాహరణకు టీ చేయడం లేదా చిన్న కర్రీ వండటం వంటి వాటికి ఇది సరిపోతుంది. కాంపాక్ట్ సైజ్ ఉండటం వల్ల హాస్టల్ గదులు లేదా చిన్న రూమ్స్‌లో వాడటానికి బాగా సూట్ అవుతుంది. హీట్ కూడా త్వరగా వస్తుంది. కాబట్టి రోజువారీ చిన్న చిన్న వంటలకు ఇది బెస్ట్ ఆప్షన్.

Advertisement

ALFALITE 1500W:
ఈ కాయిల్ స్టౌవ్ మిడిల్ రేంజ్‌లో ఒక మంచి బ్యాలెన్స్ ఆప్షన్. దీనిలో వేడి త్వరగా వస్తుంది. అంతే కాకుండా కాస్త పెద్ద వంటలు కూడా సింపుల్ గా చేయవచ్చు. రైస్, కర్రీ, ఫ్రై వంటి సాధారణ వంటలన్నీ.. కంఫర్ట్‌గా చేయగలుగుతారు. బాడీ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల దీన్ని డైలీ కూడా వాడుకోవచ్చు.

BAJAJ VACCO 2000W:

కాయిల్ హాట్ ప్లేట్ హై పవర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. 2000W పవర్ ఉండటం వల్ల దీని నుంచి వేడి చాలా వేగంగా వస్తుంది. పెద్ద మొత్తంలో వంట చేయాల్సినప్పుడు లేదా ఫ్యామిలీ యూజ్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ టైమ్ వంట చేసినా ఇది స్టేబుల్‌గా పని చేస్తుంది.

కాయిల్ స్టౌవ్స్‌లో హీట్ డైరెక్ట్‌గా వస్తుంది కాబట్టి వంట త్వరగా పూర్తవుతుంది. హీట్ సమానంగా గిన్నెకు చేరడం వల్ల వంట కూడా బాగా అవుతుంది. ఇండక్షన్‌తో పోలిస్తే.. కాస్త ఎక్కువ హీట్ బయటకు వచ్చినా.. బాగా పనిచేస్తాయి. సింపుల్ వంటల కోసం ఇవి బెస్ట్.

Also Read: రూ.2000 లోపు బెస్ట్ ఇండక్షన్లు (2026) – టాప్ 5 మోడల్స్, ఫీచర్లు & ధర

ప్రయోజనాలు:
ఎలక్ట్రిక్ కాయిల్ స్టౌవ్‌లలో ప్రధానంగా కనిపించే ప్రయోజనం తక్కువ ధర. ఇవి చాలా అఫోర్డబుల్‌గా ఉంటాయి. వీటిపై ఏ మెటల్ పాత్రలైనా వాడుకోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా కొత్త పాత్రలు కొనాల్సిన అవసరం లేదు. వాడటం చాలా సింపుల్ కాబట్టి ఎక్కడైనా తీసుకెళ్లి వాడుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు అవసరం ఉండవు.

లోపాలు:
కాయిల్ స్టౌవ్‌లలో ఒక చిన్న లోపం ఏంటంటే.. వేడి బయటకు ఎక్కువగా వస్తుంది. దీని వల్ల కొంత మేరకు కరెంట్ బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇండక్షన్ స్టౌవ్‌లలో ఉండే అడ్వాన్స్ ఫీచర్స్ ఇందులో ఉండవు. కాబట్టి పూర్తిగా మోడర్న్ కుకింగ్ అనుభవం కోరుకునేవారికి ఇది ఇబ్బందిగా అనిపించవచ్చు.

Also Read: తక్కువ ఖర్చుతో వేగంగా వంట చేయాలా ? iBELL ఇండక్షన్ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్

ఎవరికి బెస్ట్?
ఈ స్టౌవ్స్ ముఖ్యంగా స్టూడెంట్స్, హాస్టల్‌లో ఉండేవారు, చిన్న కుటుంబాలు లేదా ట్రావెల్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడతాయి. అదనంగా.. ఇంట్లో బ్యాకప్ స్టౌవ్‌గా కూడా వాడుకోవచ్చు. సింపుల్, తక్కువ ఖర్చుతో వంట చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మొత్తానికి.. తక్కువ ధరలో సింపుల్‌గా వాడుకునే స్టౌవ్ కావాలంటే ఎలక్ట్రిక్ కాయిల్ స్టౌవ్ మంచి ఆప్షన్. చిన్న చిన్న వంటల కోసం 1000W, రెగ్యులర్ వాడకం కోసం 1500W, ఫ్యామిలీ కోసం 2000W మోడల్ తీసుకుంటే సరిపోతుంది. మీ అవసరానికి తగ్గట్టు సరైన మోడల్ ఎంచుకుంటే మంచిది.

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×