E-Paper
Advertisement

OTT Movie : మార్షల్ ఆర్టిస్ట్ కు అప్పనంగా పోలీస్ జాబ్… క్రిమినల్స్ కు దబిడి దిబిడే… యాక్షన్ ప్రియులకు పక్కా కిక్కిచ్చే మూవీ

OTT Movie : మార్షల్ ఆర్టిస్ట్ కు అప్పనంగా పోలీస్ జాబ్… క్రిమినల్స్ కు దబిడి దిబిడే… యాక్షన్ ప్రియులకు పక్కా కిక్కిచ్చే మూవీ

OTT Movie : మార్షల్ ఆర్ట్స్ తో ఓ కొరియన్ సినిమా కేకలు పెట్టిస్తోంది. యాక్షన్ సీన్స్ తో చూపుతిప్పుకోకుండా చేస్తోంది. ఈ మధ్య కొరియన్ సినిమాలు క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. రొమాంటిక్ సినిమాల నుంచి, యాక్షన్ కామెడీ దాకా వీటి రూటే సపరేట్ అన్నట్లు ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక సాధారణ డెలివరీ బాయ్, ఒక్కసారిగా మార్షల్ ఆర్ట్స్ సూపర్ హీరో అయిపోతాడు. క్రిమినల్స్ పాలిట డెవిల్ గా మారుతాడు. మార్షల్ ఆర్ట్స్ మూవీ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఎలా ఉంటుంది. అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో

2024లో వచ్చిన కొరియన్ యాక్షన్ కామెడీ మూవీ ‘అఫీసర్ బ్లాక్ బెల్ట్’ (Officer Black Belt). జేసన్ కిమ్ డైరెక్షన్ లో ఇది రూపొందింది. ఇందులో కిమ్ వూ-బిన్, కిమ్ సుంగ్-క్యున్, లీ హ్యున్-గ్యోల్, రెన్ హనమి లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2024 సెప్టెంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ రిలీజ్ అయింది. 108 నిమిషాల రన్‌ టైమ్ తో ఐయండిబిలో 6.9/10 రేటింగ్ పొందింది. తెలుగు డబ్బింగ్‌తో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

లీ జుంగ్ అనే 25 ఏళ్ల యువకుడు రోజంతా తండ్రి చికెన్ షాప్‌లో డెలివరీ డెలివరీ పని చేస్తూ, ఫ్రెండ్స్‌తో సమయం గడుపుతూ ఉంటాడు. కానీ ఇతనికి ఒక సీక్రెట్ సూపర్ పవర్ ఉంది. తాయ్‌క్వాండో, కెండో, జుడోలో ఇతనికి బ్లాక్ బెల్ట్ కూడా వచ్చింది. రోజూ డెలివరీ వెళ్తూ రోడ్డు మీద ఎవడైనా గొడవ పడితే ఒక్క కిక్‌తో ఫ్లాట్ చేస్తుంటాడు. ఒక రోజు డెలివరీ వెళ్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ ని, జైలు నుంచి బయటికి వచ్చిన క్రిమినల్ గట్టిగా కొడుతున్నట్టు చూస్తాడు. లీ జుంగ్ హీరో లాగా వచ్చి, 10 సెకన్లలో ఆ క్రిమినల్‌ని బీట్ చేసి పడేస్తాడు. ఆ సీన్ చూసిన డిపార్ట్‌మెంట్ బాస్ సున్ అనే మహిళా ఆఫీసర్ లీ జుంగ్ ని డిపార్ట్మెంట్ లోకి తీసుకుంటుంది. జైలు నుంచి బయటికి వచ్చిన క్రిమినల్స్‌ని కంట్రోల్ చేయడం ఇతని పని. వాళ్లు మళ్లీ క్రైమ్ చేస్తే నేరుగా ఫైట్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది.

Read Also : పూర్వీకుల ఇంట్లో పిల్ల మిస్సింగ్… తల్లిని టెన్షన్ పెట్టే టైం లూప్… ఫ్యూజులు అవుటయ్యే హర్రర్ మూవీ

లీ జుంగ్ మొదట్లో నాకు ఇష్టం లేదని గొడవ చేస్తాడు కానీ, సున్ బలవంతం చేసి పార్ట్‌నర్‌గా పెట్టేస్తుంది. వీళ్ల ఫస్ట్ కేస్ మొదలవుతుంది. ఒక చిన్న కేసు అనుకుని క్రిమినల్ ని పట్టుకుంటే, ఆ కేస్ ఒక భయంకరమైన గ్యాంగ్ అని, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మే గ్యాంగ్ అనితెలుస్తుంది. ఇక అక్కడి నుంచి లీ జుంగ్ ఫుల్ యాక్షన్ మోడ్ ఆన్ అవుతుంది. రోడ్డు మీద గ్యాంగ్‌ని ఒక్కడే కిక్స్‌తో పడేస్తాడు. ఒక సీన్‌లో ఒకేసారి 20 మందితో ఫైట్ చేసి ఎముకలు విరగ్గొడతాడు. ఈ సమయంలో సున్ తో బంధం కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఒక సాధారణ డెలివరీ బాయ్ ఒక్కసారిగా మార్షల్ ఆర్ట్స్ సూపర్ హీరో అయి, సమాజంలోని భయంకరమైన క్రిమినల్స్‌ని కిక్స్‌తో, పంచ్‌లతో పడేస్తాడు. చివరికి ఇలాంటి ఆఫీసర్లు మన దేశంలో కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది.

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×