E-Paper
Advertisement

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!
Advertisement

Don 3 dispute: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్’ మధ్య నడుస్తున్న ‘డాన్ 3’ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. నటుడిపై గతంలో విధించిన ‘సహకరించకూడదనే ఆదేశాలను’ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) వెనక్కి తీసుకున్నప్పటికీ, సమస్య ఇంకా పూర్తిగా ముగియలేదు.

Read also-నువ్వొస్తానంటే.. మేమొద్దంటామా? ప‌వ‌న్‌కు ప్ర‌కాశ్ చుర‌కే క‌రెక్టు..! అన‌వ‌స‌ర హైప్ ఇస్తున్నారా?

Advertisement

వివాదం నేపథ్యం

ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీలకు చెందిన ‘ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా ‘డాన్ 3’ను ప్రకటించారు. అయితే షూటింగ్ ప్రారంభానికి కొన్ని వారాల ముందే రణ్‌వీర్ సింగ్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో, నిర్మాణ సంస్థకు దాదాపు రూ.45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. సినిమాను నమ్ముకున్న వందలాది మంది టెక్నీషియన్ల జీవనోపాధి దెబ్బతింటుందనే ఉద్దేశంతో FWICE రణ్‌వీర్ సింగ్‌కు వ్యతిరేకంగా నాన్-కోఆపరేషన్ ఆర్డర్ జారీ చేసింది.

Advertisement

ఈ ఆదేశాలపై రణ్‌వీర్ సింగ్ లీగల్ నోటీసులు పంపడం, అలాగే ఇతర సినీ సంఘాల విజ్ఞప్తుల మేరకు FWICE జూన్ 3న ఆ ఆర్డర్‌ను అధికారికంగా ఉపసంహరించుకుంది. అయితే, సినిమా ఆగిపోయినప్పటికీ టెక్నీషియన్లకు ఇవ్వాల్సిన బకాయిలన్నింటినీ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇప్పటికే పూర్తిగా చెల్లించేసింది.

రంగంలోకి ప్రొడ్యూసర్స్ గిల్డ్

కార్మిక సమాఖ్య వెనక్కి తగ్గినప్పటికీ, నిర్మాతలకు జరిగిన భారీ నష్టంపై ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ సీరియస్‌గా ఉంది. ఇరువర్గాల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు గిల్డ్ త్వరలోనే సరికొత్తగా చర్చలు జరపనుంది. గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ గోస్వామి మాట్లాడుతూ.. చర్చల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ అది కుదరకపోతే కోర్టుకు వెళ్లే మార్గం ఎలాగూ ఉంటుందని స్పష్టం చేశారు.

Read also-బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

ఈ వివాదం కారణంగా భవిష్యత్తులో స్టార్ హీరోలు చివరి నిమిషంలో ప్రాజెక్టుల నుండి తప్పుకుని నిర్మాతలను నష్టాల్లోకి నెట్టకుండా ఉండేందుకు, నటుల కమిట్‌మెంట్స్‌పై కఠినమైన ‘ఇండస్ట్రీ ప్రొటోకాల్స్’ (కొత్త రూల్స్) తీసుకురావాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ యోచిస్తోంది. ప్రస్తుతానికి రణ్‌వీర్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, గిల్డ్ జరపబోయే చర్చల్లో ఈ వివాదం సర్దుమణుగుతుందా లేక కోర్టు మెట్లు ఎక్కుతుందా అనేది బాలీవుడ్‌లో ఉత్కంఠ రేపుతోంది.

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×