E-Paper
Advertisement

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు
Advertisement

Hyderabad: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలపై రాజకీయాలు ఒకొక్కటిగా రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ కూడా నోరు విప్పింది. తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు బీజేపీ చీఫ్ రామచందర్‌రావు.

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ

Advertisement

గురువారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఆయన మీటింగ్ పెడితే కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రియాక్ట్ అవుతున్నారని అన్నారు.

తెలంగాణ మీ అయ్యా జాగీరా అని పవన్ అంటే కచ్చితంగా స్పందిస్తామన్నారు. తనకు తెలిసినదేంటంటే.. కాంగ్రెస్ మంత్రి తెలంగాణ తన జాగీరు అన్నట్టుగా మాట్లాడారని వివరించారు. దానికి మద్దతుగా బీఆర్ఎస్ నేత తెలంగాణ ఎవరి సొత్తు కాదని, నాలుగు కోట్ల ప్రజల జాగీరు అని అన్నారని తెలిపారు.

Advertisement

రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

నాలుగు కోట్ల జనాభా జాగీరని ఇప్పుడు అంటున్నారని, గతంలో మా కుటుంబం జాగీరని పాలన చేశారన్నారు. వాళ్లు మాటలు తాను వినలేదని తెలంగాణను ఎవరు అవమాన పరిచినా, ప్రజల మనోభావాలను దెబ్బ తీసినా దాన్ని కచ్చితంగా బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ హీరోనా విలనా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించార ఆ పార్టీ స్టేట్ చీఫ్. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సూపర్ హీరో అని మనసులోని మాట బయపెట్టారు. తాము ప్రజలతో పని చేస్తున్నామని, ప్రజల కోసం, ప్రజల్లోనే చేస్తామన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్‌తో పని చేయాల్సిన అవసరం లేదన్నారు.

ALSO READ:  గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగాలేదు

బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాలను ఆ రెండు పార్టీలు కలిసి వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అందులో మహిళా రిజర్వేషన్లు- నియోజకవర్గాల పునర్విభజన బిల్లు అని చెప్పారు. చెన్నైలో స్టాలిన్ సమావేశం పెడితే సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ కలిసి వెళ్లారని గుర్తు చేశారు.

వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ను ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయన్నారు. సర్ విషయంలోనూ రెండు పార్టీలు వ్యతిరేకించాయన్నారు. అన్ని అంశాలపై బీజేపీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు వున్నాయని, పని చేస్తున్నాయని చెప్పారు. తమను భూతంగా చూపిస్తున్నారని, అసలు భూతాలు ఈ రెండు పార్టీలని తేల్చేశారు.

 

 

 

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×